తెగిపడిన విద్యుత్‌ తీగలు - చెలరేగిన మంటలు

ABN , First Publish Date - 2023-01-29T23:04:03+05:30 IST

పిట్ట్టిగుంట బస్టాప్‌ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 11కేవీ విద్యుత్‌ తీగలు ఇళ్ల వద్ద తెగిపడ్డాయి.

తెగిపడిన విద్యుత్‌ తీగలు - చెలరేగిన మంటలు
తీగలు తెగిపడడంతో చెలరేగిన మంటలు

కాశినాయన జనవరి 29: పిట్ట్టిగుంట బస్టాప్‌ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 11కేవీ విద్యుత్‌ తీగలు ఇళ్ల వద్ద తెగిపడ్డాయి. ఈ ప్రాంతంలో ము ళ్ళ చెట్లు దట్టంగా ఉండడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏమి జరి గిందో తెలియక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు విద్యుత్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కరెంట్‌ సరఫరాను నిలుపుదల చేశారు. తీగలు పడిన ప్రాంత సమీపంలో ఓఆర్మీ ఉ ద్యోగి, కొందరి నివాసగృహాలున్నాయి.

తీగలు తెగిపడడంతో చెలరేగిన మంటలతో షార్ట్‌సర్క్యూట్‌ జరిగి ఇళ్ల మధ్య తీగలు తెగిపడి ఉంటే పెనుప్రమాదం సంభవించేద ని స్థానికులు తెలిపారు. గతంలో కూడా 11కేవి విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. కాలంచెల్లిన తీగలు తరుచూ తెగిపడుతుండటం సరఫరాకు అంతరాయం ఏర్పడటం సిబ్బం ది అతుకులు వేసి సరిచేస్తుండడం పరిపాటిగా మారింది. ప్రాణనష్టం సంభవించకముందే అధికారులు లైనును పక్కకు మారుస్తూ కొత్తలైను ఏర్పాటు చేయాలని కోరారు.

Updated Date - 2023-01-29T23:04:05+05:30 IST