నేటి నుంచి డీవైఎ్‌ఫఐ పర్యటనలు

ABN , First Publish Date - 2023-04-09T23:47:55+05:30 IST

కడప నగరంలోని ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై డీవైఎ్‌పఐ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి విస్తృతంగా పర్యటనలు చేపడుతున్నట్లు ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎ్‌ఫఐ) నగర కార్యదర్శి డీఎం ఓబులేసు తెలిపారు.

నేటి నుంచి డీవైఎ్‌ఫఐ పర్యటనలు

కడప (సెవెన్‌రోడ్స్‌), ఏప్రిల్‌ 9 : కడప నగరంలోని ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై డీవైఎ్‌పఐ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి విస్తృతంగా పర్యటనలు చేపడుతున్నట్లు ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎ్‌ఫఐ) నగర కార్యదర్శి డీఎం ఓబులేసు తెలిపారు. నగరంలోని పాతబస్టాండులోని ఆ సంఘం కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నగరంలో నీటి క ష్టాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయన్నారు. అక్కాయపల్లె, సాయిపేట, ఖలీల్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో వారం పదిరోజులైనా నీళ్లు రాని పరిస్థితి ఉందన్నారు. రామక్రిష్ణనగర్‌, సుందరయ్యనగర్‌, వైఎ్‌సఆర్‌ కాలనీ మృత్యుంజయకుంట తదితర ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయన్నారు. చెత్త పన్ను, ఆస్తి పన్ను నీటి మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా డీవైఎ్‌ఫఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టే ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2023-04-09T23:47:55+05:30 IST