Lokesh YuvaGalam: లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్! కారణమిదే..!
ABN , First Publish Date - 2023-05-25T14:47:16+05:30 IST
నారా లోకేష్ యువగళం పాదయాత్ర జమ్మలమడుగులో ముగిసింది. పాదయాత్రకు నాలుగు రోజుల పాటు బ్రేక్ పడింది.
కడప: నారా లోకేష్ యువగళం పాదయాత్ర ((Nara Lokesh Yuvagalam padayatra) ) జమ్మలమడుగులో ముగిసింది. పాదయాత్రకు నాలుగు రోజుల పాటు బ్రేక్ పడింది (Four days break). ఈనెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరగనుంది. ఇందుకోసం పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి ఈనెల 30న జమ్మలమడుగు నుంచే పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే పాదయాత్ర ముగించుకుని జమ్మలమడుగు నుంచీ కడప ఎయిర్‌పోర్టుకు బయల్దేరి వెళ్లారు. ప్రత్యేక విమానంలో నారా లోకేష్ అమరావతికి చేరుకోనున్నారు. రేపు అమరావతి నుంచీ బయల్దేరి రాజమండ్రిలో జరిగే మహానాడు ప్రాంతానికి వెళ్లనున్నారు.
ఇవాళ ఇలా..
గురువారం జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం, పెద్దపసుపుల గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర కొనసాగింది. పెద్ద ఎత్తున దళితులు, మైనార్టీలు, రైతులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.