టీడీపీలోకి పారిశ్రామికవేత్త జయచంద్రారెడ్డి
ABN , Publish Date - Dec 16 , 2023 | 12:23 AM
తంబ ళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరిపల్లె జయచంద్రా రెడ్డి శుక్రవారం సాయత్రం మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాయునాయుడు సమక్షంలో పార్టీ లో చేరారు.
చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరుతున్న పారిశ్రామికవేత్త జయచంద్రారెడ్డి
చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిక
ములకలచెరువు, డిసెంబరు 15: తంబ ళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరిపల్లె జయచంద్రా రెడ్డి శుక్రవారం సాయత్రం మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాయునాయుడు సమక్షంలో పార్టీ లో చేరారు. ఆయనతో పాటు భారీ అనుచ ర వర్గం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ములకలచెరువు మండలం కదిరినాధునికోటకు చెందిన దాసరిపల్లె జయచంద్రారెడ్డి నాలుగేళ్లుగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నియో జకవర్గంలో అధిక ఓట్లు ఉన్న మొరుసు కాపుల్లో మంచి పట్టున్న నేతగా ఎదిగారు. ఈ క్రమంలో ఆయన తంబళ్లపల్లె టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గత నెల 30వతేదీన హైదరాబాదులో చంద్రబాబునాయుడిని, ఈ నెల 6వతేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశను కలిశారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం సాయంత్రం తన భారీ అనుచర వర్గం, మొరుసుకాపు నాయకులు, మొరుసు కాపు కుల స్థులతో కలిసి వందకుపైగా వాహనాల్లో మంగళగిరికి వెళ్లి టీడీపీ అధినేత చంద్రబా బు సమక్షంలో పార్టీలో చేరారు. కాగా జయచంద్రారెడ్డి చేరికతో తంబళ్లపల్లె నియోజక వర్గం లో టీడీపీ మరింత బలపడుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహ నరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు గురవారెడ్డి, టీడీపీ నేత పర్వీనతాజ్ పాల్గొన్నారు.