వైసీపీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం
ABN , First Publish Date - 2023-04-13T23:46:00+05:30 IST
రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన మోహన రెడ్డి ప్రభుత్వం ప్రజల శాపనార్థాలతో కాలగ ర్భంలో కలిసిపోతుందని మాజీ ఎమ్మెల్యే రమేశకు మార్‌రెడ్డి అన్నారు.

చిన్నమండెం, ఏప్రిల్ 13: రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన మోహన రెడ్డి ప్రభుత్వం ప్రజల శాపనార్థాలతో కాలగ ర్భంలో కలిసిపోతుందని మాజీ ఎమ్మెల్యే రమేశకు మార్‌రెడ్డి అన్నారు. గురు వారం మండలంలోని కొత్త పల్లె పంచాయతీలోని దిన్నె మీదపల్లె, కుర్వపల్లె, వట్టం వాండ్లపల్లె, శ్రీనివాసపు రం, గువ్వపల్లె, శ్రీరామ్‌నగర్ కాలనీ, వంకవాండ్లపల్లెల్లో ఇదేం కర్మ మన రాష్ర్టానికి, రచ్చబండ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైసీపా పాలనపై ప్రజలకు వివరించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో రోడ్లు గుంతలమయమై అధ్వా నంగా తయారైనా పట్టించుకునే వారే లేరన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నాలుగేళ్లలో నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత చార్జీలు విపరీతంగా పెంచి పేదల నడ్డివిరుస్తోందన్నారు. ప్రజలు బాధతో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు కాల గర్భంలో కలిసిపోతుందా అని ఎదురుచూస్తున్నార న్నారు. టీడీపీ నాయకులు బెల్లం నరసింహారెడ్డి, అమర్‌నాధరెడ్డి, దేవగోపాల్ నాయు డు, చెన్నక్రిష్ణారెడ్డి, బాసితఖాన, బాకీవుల్లాఖాన, ప్రతాప్‌నాయుడు పాల్గొన్నారు.