ఆదర్శప్రాయుడు జ్యోతిరావుపూలే
ABN , First Publish Date - 2023-04-11T23:01:58+05:30 IST
అందరికీ ఆదర్శప్రాయుడు మహాత్మా జ్యోతిరావుపూలే అని కలెక్టర్ పీఎస్ గిరిషా తెలిపారు.
జయంతి వేడుకల్లో కలెక్టర్ పీఎస్ గిరీషా
రాయచోటి టౌన్, ఏప్రిల్ 11: అందరికీ ఆదర్శప్రాయుడు మహాత్మా జ్యోతిరావుపూలే అని కలెక్టర్ పీఎస్ గిరిషా తెలిపారు. మంగళవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాయచోటి పట్టణంలోని పూలే విగ్రహానికి కలెక్టర్ పీఎ్‌స గిరీషా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో జ్యోతిరావుపూలేకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జ్యోతిరావుపూలే జీవనశైలిని మనమందరం నేర్చుకోవాల్సి ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు అని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సమాజంలో స్ర్తీలు చదువుకోవడం ఎంతో ఆవశ్యకమని గుర్తించి ఈ దిశగా మొదట తన సతీమణికే విద్యను నేర్పించిన ఆయన మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. కలెక్టరేట్లో జరిగిన జయంతి వేడుకలలో డీఆర్‌వో సత్యనారాయణ, కలెక్టరేట్ ఏఓ బాలకృష్ణ, రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, తదితరులు పాల్గొన్నారు.