ఆర్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన కడప టీడీపీ ఇన్‌చార్జి మాధవీరెడ్డి

ABN , First Publish Date - 2023-09-10T23:23:06+05:30 IST

దివంగత మాజీ మంత్రి ఆర్‌రాజగోపాల్‌రెడ్డి ఘాట్‌ వద్ద ఆదివారం కడప టీడీపీ ఇన్‌చార్జి ఆర్‌మాధవీరెడ్డి, పొలిట్‌బ్యూరోసభ్యుడు ఆర్‌ శ్రీనివాస రెడ్డి నివాళులర్పించారు.

ఆర్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన కడప టీడీపీ ఇన్‌చార్జి మాధవీరెడ్డి
ఆర్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తున్న శ్రీనివాసరెడ్డి, మాధవీరెడ్డి

లక్కిరెడ్డిపల్లె,సెప్టెంబరు10: దివంగత మాజీ మంత్రి ఆర్‌రాజగోపాల్‌రెడ్డి ఘాట్‌ వద్ద ఆదివారం కడప టీడీపీ ఇన్‌చార్జి ఆర్‌మాధవీరెడ్డి, పొలిట్‌బ్యూరోసభ్యుడు ఆర్‌ శ్రీనివాస రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఆర్‌ఆర్‌ స్వగృహంలో రాయచోటి టీడీపీ ఇన్‌చార్జి ఆర్‌ రమేశ్‌కుమార్‌రెడ్డి ఆశీర్వాదాలు పొందిన ఆమె మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ కుటుంబానికి కోడలిని అయినందుకు గర్వపడుతున్నానని ఈ కుటుంబం తరపున రాజకీయ రంగప్ర వేశం చేస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నానన్నారు. ఆర్‌ఆర్‌ సోదరులు పార్టీకి చేస్తు న్న సేవలను గుర్తించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కడప టీడీపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారన్నారు.

కడప ప్రజలకు సేవలందించి వారి నమ్మకాన్ని వమ్ముకాకుండా కష్టపడి కడప ప్రజల వారి గుండెల్లో స్థానాన్ని సంపాదిం చుకుంటున్నానన్నారు. రాజకీయంగా ఆర్‌ఆర్‌ కుటుంబానికి మంచి పేరు తెస్తానని పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తానన్నారు. మా మామగారు దివంగత రాజగోపాల్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా మంచి ఆదరణ పొందారని, ఆర్‌ఆర్‌ సోదరులు పార్టీని వదలకుండా ఇప్పటికీ ప్రజలకు సేవలందిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామ న్నారు. క్యాక్రమంలో మాజీ మార్కెట్‌ చైర్మన్‌ కాలాడి ప్రభాకర్‌రెడ్డి. కాలాడి నాగిరెడ్డి, బడుగువాసుదేవుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-10T23:23:06+05:30 IST