సీఎం కేంద్రాన్ని కోరితే కడప-బెంగళూరు రైల్వే పనులు

ABN , First Publish Date - 2023-01-23T00:02:55+05:30 IST

సీఎం జగన అనాలోచిత నిర్ణయంతో తన తండ్రి హ యాంలో మంజూరైన కడప-బెంగళూరు రైల్వే పనులు రద్దయ్యాయని, మళ్లీ ఆయ న పునరాలోచించి కేంద్రాన్ని కోరితే పను లు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజంపేట పార్లమెంటరీ బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

సీఎం కేంద్రాన్ని కోరితే కడప-బెంగళూరు రైల్వే పనులు
మాట్లాడుతున్న సాయి లోకేష్‌

వైసీపీది రాయలసీమ పట్ల క పట ప్రేమ

రాజంపేట పార్లమెంటరీ బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేష్‌ కుమార్‌

కురబలకోట, జనవరి 22: సీఎం జగన అనాలోచిత నిర్ణయంతో తన తండ్రి హ యాంలో మంజూరైన కడప-బెంగళూరు రైల్వే పనులు రద్దయ్యాయని, మళ్లీ ఆయ న పునరాలోచించి కేంద్రాన్ని కోరితే పను లు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజంపేట పార్లమెంటరీ బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేష్‌కుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని అంగళ్లులో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ మార్గంలో పనులను ప్రారంభించి కడప నుంచి పెండ్లిమర్రి వరకు పూర్తిచేసిందన్నారు. అయితే సీఎం జగన కేంద్రానికి ఈ మార్గాన్ని రద్దు చేసి మరో మార్గాన్ని ఏర్పాటు చేయాలని లిఖిత పూర్వకంగా లేఖ రాయడంతోనే ఈ పనులు రద్దయ్యాయన్నారు. రాష్ట్రప్రభుత్వం రాయలసీమ పట్ల కపట ప్రేమను చూపుతోందన్నారు. రాజంపేట పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో సమస్యలను గుర్తిం చి కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించనున్నట్లు తెలిపారు. కురబలకోట రైల్వే స్టేషనలో అన్ని రైళ్లు ఆగేలా కేంద్ర రైల్వే శాఖామంత్రి దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరిస్తానన్నారు. బతుకుదెరువు నిమిత్తం విదేశాలకు వెళ్లే వారి గ్రామాల్లో త్వరలో నే కేంద్ర బృందం పర్యటించి వారి సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్‌, అంజాద్‌, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-23T00:02:56+05:30 IST