వైభవంగా శక్తిమాత జాతర
ABN , First Publish Date - 2023-05-08T00:14:32+05:30 IST
వాల్మీకిపురం పట్టణంలోని రామ్‌నగర్ కాలనీలో వెలసిన శక్తిమాత అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం వైభ వంగా నిర్వహించారు.
వాల్మీకిపురం, మే 7: వాల్మీకిపురం పట్టణంలోని రామ్‌నగర్ కాలనీలో వెలసిన శక్తిమాత అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం వైభ వంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో అమ్మవారికి అభిషేకం, అర్చన, విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిగాయి. వేకువజా ము నుంచి అధిక సంఖ్యలో మహిళలు దీలు, బోణాలు సమర్పించి అమ్మవారికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అలంకరణలు గావించి పురవీధులలో నగరోత్సవం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈసందర్భంగా చాందిని బళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్ర మాలలో అర్చకులు జనార్దన, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
శాసో్త్రక్తంగా ద్రౌపదీ కల్యాణోత్సవం
పీలేరు, మే 7: పీలేరు ఆర్టీసీ బస్టాండు వద్ద జరుగుతున్న మహాభార త ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ద్రౌపదీ దేవి కల్యాణోత్సవ ఘట్టా న్ని శాసో్త్రక్తంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మేళతాళాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ ద్రౌపదీ దేవి పాండవుల కల్యాణ క్రతువును నిర్వాహకులు జరిపించారు. అంతకుమునుపు పాండవులు, ద్రౌపదీ దేవి ఉత్సవ మూర్తులను పీలేరు పట్టణ వీధుల్లో ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవాలకు తమ వంతు విరాళాలు సమర్పించుకు న్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు రాజు, శ్రీవిద్య, లక్ష్మీపతి, భారతి, రమణ, రెడ్డమ్మ, ఆదినారాయణ అనూష, ఆనంద, యల్లమ్మ, యల్ల య్య, సరస్వతి, నాగరాజ, పద్మ, రమణరాజు, కళావతి పాల్గొన్నారు.