ఆగని ఇసుక అక్రమ రవాణా.. రైతుల నిరసన

ABN , First Publish Date - 2023-04-04T23:03:25+05:30 IST

మండలంలోని గంగాపురం ఇసుక రీచ వద్ద మం గళవారం కలికిరి మండలం మహ ల్‌, అద్దవారిపల్లె గ్రామ రైతులు మరోమారు నిరసన వ్యక్తం చేశా రు.

ఆగని ఇసుక అక్రమ రవాణా.. రైతుల నిరసన
నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు

కలకడ, ఏప్రిల్‌ 4: మండలంలోని గంగాపురం ఇసుక రీచ వద్ద మం గళవారం కలికిరి మండలం మహ ల్‌, అద్దవారిపల్లె గ్రామ రైతులు మరోమారు నిరసన వ్యక్తం చేశా రు. సుమారు రెండు గంటల పాటు రీచలో ఇసుక తవ్వే యం త్రాలను బయటకు పంపి రవాణా ను స్థంభింపజేశారు. గత శుక్ర వారం తాము వాహనాలకు అడ్డుకున్నప్పుడు మాత్రమే ఇసుక తవ్వకాలను ఆపినట్లు తెలిపారు. తాము వెళ్లిపోగానే యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు కొనసాగించినట్లు వాపోయా రు. ఇంత వ్యవహారం జరుగుతున్నా మైనింగ్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహ రిస్తున్నారని మండిపడ్డారు. ఆయకట్టు రైతుల అభిప్రాయం సేకరించకుండా రీచకు అనుమతులు ఎలా మంజూర య్యాయని అధికారులను ప్రశ్నించారు. జిల్లా అధికారులు స్పందించి అక్రమ ఇసుక తవ్వకాలను ఆపాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2023-04-04T23:03:25+05:30 IST