రాధాక్రిష్ణ మందిర ఏర్పాట్ల పరిశీలన

ABN , First Publish Date - 2023-09-06T00:08:47+05:30 IST

నగర పంచాయతీ పరిధిలోని రైల్వేగేటు సమీపంలో ఉన్న రాధాక్రిష్ణ మందిరం ఏడో వార్షికోత్సవం వేడుకల ఏర్పాట్లను మంగళవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి పరిశీలించారు.

రాధాక్రిష్ణ మందిర ఏర్పాట్ల పరిశీలన
ఏర్పాట్లను పరిశీలిస్తున్న పుత్తా నరసింహారెడ్డి

కమలాపురం రూరల్‌, సెప్టెంబరు 5: నగర పంచాయతీ పరిధిలోని రైల్వేగేటు సమీపంలో ఉన్న రాధాక్రిష్ణ మందిరం ఏడో వార్షికోత్సవం వేడుకల ఏర్పాట్లను మంగళవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి పరిశీలించారు. ఈ నెల 7న క్రిష్ణాష్టమి రోజున వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షికోత్సవంలో భాగంగా గోపూజ, మూలమూర్తికి అభిషేకం, సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణం, కుంకుమార్చన, నక్షత్ర కుంభహారతి, వేద స్వస్తి, తీర్ధ ప్రసాద వినియోగం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. బండలాగుడు పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు, అల్లెంగుండు, ఉట్టి కొట్టే పోటీల్లో విజేతలకు నగదు బహుమతి అందజేసినట్లు ఆయన తెలిపారు. శ్రీకృష్ణ వేషధారణలను చేపట్టిన వారికి బహుమతులు అందజేస్తామన్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.వార్షికోత్సవ వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఏర్పాట్ల పరిశీలనలో వెంకట వాసుదేవరెడ్డి, దివాకర్‌రెడ్డి, రాఘవరెడ్డి, జంపాల నరసింహారెడ్డి, శంకర్‌రెడ్డి, మల్లేష్‌ రాయల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-06T00:08:47+05:30 IST