పంచ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి
ABN , First Publish Date - 2023-07-17T23:42:49+05:30 IST
దళితులను కులం పేరుతో దూషించి అవమాన పరచిన పంచ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
నిమ్మనపల్లె, జూలై 17: దళితులను కులం పేరుతో దూషించి అవమాన పరచిన పంచ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఆమేరకు సోమవారం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా మాల మహానాడు అధ్యక్షుడు మాణిక్యం, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రెడ్డినారాయణ మా ట్లాడుతూ పంచప్రభాకర్‌రెడ్డి దళితుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడి కించపరచాడన్నారు. దళితులను కు లం పేరుతో దూషించి అవమాన పరచిన పంచ ప్రభాకర్‌రెడ్డి పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంత రం పంచ ప్రభాకర్ రెడ్డి చిత్రప టాన్ని చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. కేసు నమో దు చేయకపోతే నిరసర కార్యక్రమాలను దళితులు మరింత ఉధృతం చేస్తారన్నారు. కార్యక్రమంలో దళిత నాయకులు సుధా కర్, గంగులప్ప, ఎర్రయ్య, జగదీష్, నాగరాజ, చెన్నరాయుడు తదితరులు పాల్గొన్నారు.