రిటైర్డు ఉద్యోగులు సమాజ సేవ చేయాలి

ABN , First Publish Date - 2023-10-08T23:23:49+05:30 IST

రిటైర్డు ఉద్యోగులు సమాజంలో అనేక రకాల సమస్యలతో ఉ న్న వారిని ఆదుకోవడానికి పునరంకితం కా వాలని ప్రముఖ రచయిత వేంపల్లె అబ్దుల్‌ ఖాదర్‌ సూచించారు.

రిటైర్డు ఉద్యోగులు సమాజ సేవ చేయాలి
సురేంద్ర రెడ్డిని సన్మానిస్తున్న రిటైర్డు ఉద్యోగులు

కలికిరి, అక్టోబరు 8: రిటైర్డు ఉద్యోగులు సమాజంలో అనేక రకాల సమస్యలతో ఉ న్న వారిని ఆదుకోవడానికి పునరంకితం కా వాలని ప్రముఖ రచయిత వేంపల్లె అబ్దుల్‌ ఖాదర్‌ సూచించారు. రిటైర్డు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సి. సురేం ద్ర రెడ్డి రాష్ట్ర సంఘానికి కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్‌ ఖాదర్‌, రిటైర్డు ఎంఈవో ఆదినారాయణ రెడ్డి తదితరులు మాట్లాడుతూ మండల స్థాయి సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే వివిధ రకాల వైద్య శిబిరాలు నిర్వహించామని, మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం రిటైర్డుఉద్యోగులు విడివిడిగా సురేంద్ర రెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు జయరామ్‌, రత్నశేఖర్‌ రెడ్డి, కృష్ణా రెడ్డి, పంచరత్నమ్మ, కాంతమ్మ, సుబ్బరాఘవ శెట్టి, మస్తాన, సత్యనారాయణ రావు తదితరు ప్రసంగించారు.

Updated Date - 2023-10-08T23:23:49+05:30 IST