సింహాద్రిపురం ఎస్‌ఐగా రోషన బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2023-05-12T23:54:47+05:30 IST
సింహాద్రిపురం మండల సబ్ ఇనస్పెక్టర్‌గా ఎస్.కె.రోషన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
సింహాద్రిపురం, మే 12: సింహాద్రిపురం మండల సబ్ ఇనస్పెక్టర్‌గా ఎస్.కె.రోషన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ సునీల్‌రెడ్డి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రోషన మాట్లాడుతూ సింహాద్రిపురం మండల పరిసరాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానన్నారు. ఫ్యాక్షన, గ్యాంబ్లింగ్, జూదం వంటి వాటికి ప్రజలు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవనం గడపాలన్నారు. అలా కాకుండా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.