‘సచివాలయ ఉద్యోగులు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి’
ABN , First Publish Date - 2023-07-15T23:16:09+05:30 IST
పాఠశాల విధులపై సచివాలయ ఉద్యోగులు, మహిళా పోలీసులు, ఏఎనఎంలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సిద్దవటం ఎం పీడీవో కార్యాలయంలో శనివారం అవగాహన కల్పించారు.
సిద్దవటం, జూలై 15: పాఠశాల విధులపై సచివాలయ ఉద్యోగులు, మహిళా పోలీసులు, ఏఎనఎంలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సిద్దవటం ఎం పీడీవో కార్యాలయంలో శనివారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖాధికారి రాఘవ రెడ్డి, సర్వశిక్ష అభియాన పీడీ అంబవరం ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు ప్రభుత్వ పాఠశాల లకు వెళ్లి మధ్యాహ్న భోజనం మెనూను పరిశీలించడంతోపాటు, విద్యార్థు లు సరిగ్గా బడికి వస్తున్నారా లేదా అని గమనించాలన్నారు. అమ్మఒడి పథకానికి సంబంధించి అర్హులు, అనర్హులను గుర్తించాలన్నారు. ఏఎనఎంలు విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని అవసరమైన మందులు అంద జేయాలని సూచించారు. నాడు-నేడు ద్వారా జరుగుతున్న ప్రభుత్వ కార్యా లయాల నిర్మాణాలను ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సందర్శించి పనులు త్వరి తగతిన పూర్తయ్యేలా చూడాలని ఎంబుక్‌లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. మహిళా పోలీసులు గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా నిరోధించాలన్నారు. చదవని పిల్లలు ఎవరైనా ఉంటే చదువుకునేందుకు ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు శంకరయ్య, అరుణ, ఈవోపీఆర్‌డీ పులిరాంసింగ్, జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, మండలంలోని వెల్ఫేర్ అసిస్టెంట్లు, మహిళాపోలీసులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఏఎనఎంలు పాల్గొన్నారు.