ఆరుగురు స్మగ్లర్ల అరెస్టు
ABN , First Publish Date - 2023-03-11T23:24:19+05:30 IST
బద్వేలు పరిధివద్దిమడుగు సెక్షన్ బాలాయపల్లె బీట్ పరిధిలో ఎర్రచందనం లోడ్‌తో తరలించేందుకు సిద్దంగా ఉన్న కారు, ఆరు గురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు జిల్లా అటవీ అధికారి సందీ్‌పరెడ్డి ప్రకటించారు.
12 ఎర్రచందనం దుంగలు, కారు, రెండు బైక్‌లు స్వాధీనం
పరారీలో మరో ఇద్దరు స్మగ్లర్లు
నిందితుల వివరాలు వెల్లడించిన జిల్లా అటవీ అధికారి సందీ్‌పరెడ్డి
కడప (క్రైం)/బద్వేలు రూరల్, మార్చి 11: బద్వేలు పరిధివద్దిమడుగు సెక్షన్ బాలాయపల్లె బీట్ పరిధిలో ఎర్రచందనం లోడ్‌తో తరలించేందుకు సిద్దంగా ఉన్న కారు, ఆరు గురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు జిల్లా అటవీ అధికారి సందీ్‌పరెడ్డి ప్రకటించారు. కడపలో తన కార్యాలయంలో శనివారం బద్వేలు అటవీ క్షేత్రాధికారి మధుబాబు, డిప్యూ టీ రేంజ్ ఆఫీసర్ వెంకటశేషయ్య ఆధ్వర్యంలో వద్దిమడు గు వద్ద తమ సిబ్బంది నిఘా ఉంచినట్లు తెలిపారు.
కారులో 12 ఎర్రచందనం దుంగలను లోడ్ చేసి ద్విచక్ర వాహనం పైలెట్‌గా వ్యవహరిస్తున్నట్లు అందిన సమాచా రంతో వారిపై దాడులు నిర్వహించి ఆరుగురిని అరెస్టుచేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు పరారయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
అదుపులో ఉన్న నిందితులువీరే...
కడప చిన్నచౌకు నెహ్రూనగర్ వాసి చిలమల చంద్రశేఖ ర్, బద్వేలు టౌన్ వెంకటాద్రినగర్ వాసులు కొనిరెడ్డి నాగరాజు, కె.జానకిరామయ్య, పి.రామయ్య, బి.మఠం మండ లం మల్లెగుడి ప్రాంతం పి.ఓబులు, నంద్యాల జిల్లా ఆళ్లగడ ్డ మండలం బేరకట్లకు చెందిన రాజును అరెస్టు చేసి వారి నుంచి 12 దుంగలు, కారు, రెండు స్కూటర్లు స్వాధీనం చేసుకుని ఈ మేరకు వారిని రిమాండుకు తరలించినట్లు తెలిపారు. కాగా ప్రొద్దుటూరుకు చెందిన వెంకటక్రిష్ణ, బి.మఠం మండలం మలుగుడిపాడు గ్రామానికి చెందిన బొట్లనాగేంద్ర పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
అక్రమ రవాణాపై సమాచారం ఇవ్వండి
జిల్లాలో విలువైన ఎర్రచందనం పరిరక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందని ఎక్కడైనా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే తక్షణమే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎవరైనా పా త నేరస్తులు కానీ, కొత్త వారు అడవుల్లోకి వెళుతున్నట్లు తెలిసినా సమాచారం ఇస్తే ఎర్రచందనం అక్రమ రవాణా కు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
రోళ్లబోడు, సిద్దవటం బీట్లలో 26 దుంగలు పట్టివేత
సిద్దవటం, మార్చి11: లంకమల అభయారణ్యంలోని రోళ్ల బోడు, సిద్దవటం బీట్లల్లో రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టి 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు సిద్దవటం రేంజర్ ప్రసాద్, డిప్యూ టీ రేంజ్ అధికారి ఓబులేసు తెలిపారు. సిద్దవటం అటవీ కార్యాలయంలో శనివారం విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ లంకమల అభయారణ్యంలోని రోళ్లబోడు, సిద్దవటం బీట్లలో శుక్రవారం సాయంత్రం రెండు బృందా లుగా ఏర్పడి కూంబింగ్ నిర్వహించామన్నారు.
రోళ్లబోడు బీటులో 12 ఎర్రచందనం దుంగలు, సిద్దవటం టౌన్ బీటు లో 14 ఎర్రచందనం దుంగలను స్వాదీనం చేసుకున్నామ న్నారు. ఈ మేరకు ఎర్రచందనం దుంగలను నరికిన వారి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్ట్ బీటు అధికారులు రాజశేఖర్‌రెడ్డి, విశ్వనాధ్, హైమావతి, అటవీ సిబ్బంది, ప్రొటక్షన్ వాచర్లు తదితరులు పాల్గొన్నారు.