‘సూపర్ సిక్స్’ పథకాలతో టీడీపీ విక్టరీ తథ్యం!
ABN , First Publish Date - 2023-07-24T23:57:13+05:30 IST
మహానాడులో చంద్ర బాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల తో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గ్రాండ్ విక్టరీ సాధించడం తథ్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఇంటింటికి నల్లారిలో కిశోర్ కుమార్ రెడ్డి
పీలేరు, జూలై 24: మహానాడులో చంద్ర బాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల తో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గ్రాండ్ విక్టరీ సాధించడం తథ్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ‘ఇంటింటికీ నల్లారి’ పేరుతో పీలేరులో ఆయన చేపట్టిన భవి ష్యతకు భరోసా కార్యక్రమం రెండవ రోజైన సోమవారం పట్టణంలోని సాయిరాం నగర్, సైనిక్ నగర్, బండ్లవంక ప్రాంతాల్లో సాగిం ది. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ మహాశక్తి, అన్నదాత, యువగళం, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికీ మంచి నీరు, పూర్ టు రిచ పథకాలకు రాష్ట్ర ప్రజల్లో అపూర్వ ఆదరణ లభిస్తోందన్నారు. కల్లబొల్లి మాటలతో ఇంత కాలం ప్రజలను మోసం చేసిన అధికార వైసీపీ నేతలకు ఆ పథకాలకు లభిస్తున్న ఆదరణ చూసి గుండెల్లో గుబులు మొదలైందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి చేతిలో అన్ని రంగాల్లో మోసపోయిన రాష్ట్ర ప్రజలకు ధైర్యం చెప్పేందుకు తాము భవిష్యతకు భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతలో చైతన్యం, ఉత్సాహం నింపేందుకే తమ యువనేత నారా లోకేశ యువగళం పాతయాత్ర చేపట్టారన్నారు. బడుగు, బలహీనవర్గాల సంక్షేమం, అభివృద్ధి టీడీపీకి రెండు కళ్లు లాంటివన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా పీలేరు నియోజకవర్గంలో అభివృద్ధి నేతి బీరకాయ చందంలా ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు కోటపల్లె బాబు రెడ్డి, శ్రీకాంత రెడ్డి, అమరనాథరెడ్డి, పురం రామ్మూర్తి, పోలిశెట్టి సురేంద్ర, కంచి సూరి, లక్ష్మీకర, హనీఫ్, రెడ్డిముని, సురేశ, స్పోర్ట్స్ మల్లి, నల్లారి రియాజ్, చిన్నా, సాధనా, రమాదేవి, లక్ష్మీకాంతమ్మ, వసంతల రాజా, షౌకతఅలీ, వైన్స ఖాదర్, జీవీ రవికుమార్, టీఎనఎస్‌ఎఫ్ ముబారక్, గాండ్ల విజయ్ కుమార్, అత్తార్ చానబాషా, సుబ్బయ్య, ఖాజాపీర్, రహంతుల్లా, షమా, బుజ్జు, అన్నారెడ్డి, కప్పరం చంద్రయ్య, షామియాన జయన్న, వెంకటరమణ నాయక్, అంజి, తదితరులు పాల్గొన్నారు.