గ్రామ పంచాయతీ కాలువను వదల్లేదు..
ABN , First Publish Date - 2023-03-11T23:16:09+05:30 IST
వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే అన్నట్లు.. అధికారపార్టీ నాయకులు ఏమి చేసినా చెల్లుతుందనే ధీమాతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారికి సైతం ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలను కల్పిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచే స్తోంది.
నిమ్మనపల్లె, మార్చి 11: వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే అన్నట్లు.. అధికారపార్టీ నాయకులు ఏమి చేసినా చెల్లుతుందనే ధీమాతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారికి సైతం ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలను కల్పిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచే స్తోంది. ఇందుకు నిదర్శనంగా నిమ్మనపల్లె మండలంలోని బస్టాండులో రెండేళ్ల క్రితం నిర్మించిన మురుగునీటి కాలవ లను వదలకుండా మొత్తం ఆక్రమించుకొని మెట్లు, నిర్మా ణాలు చేపట్టారు. దీనిపై పంచాయతీ అధికారులు కాలు వపై నిర్మాణాలు చేట్టరాదని అభ్యంతరం తెలిపారు. అలా గే నిర్మాణాలు చేపట్టి ఇప్పుడు కనెక్షనను కావాలని అడ గంపై రూములకు సంబంధించిన పత్రాలు ఇవ్వాలని లేకుంటే కనుక్షన ఇవ్వమని అడ్డుకొన్నారు. దీంతో సం బందిత యజమాని అలీమ్‌ఖాన స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషాను కలిసి పంచాయతి అధికారులు బస్టాండ్ సమీ పంలో గల తన రూములకు విధ్యుత కనెక్షనను ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పంచాయతీ కార్యదర్శి గిరిధర్‌నాయక్‌ను పిలిచి కాలువను ఆక్రమించుకొన్న వాళ్లు మనవాళ్లేనని వారికి విద్యుత కనె క్షన కొరకు సిఫారసు లెటర్ రాసి ఇవ్వాలని తెలిపారు. దీంతో చేసేదేమిలేక విద్యుత కనెక్షనకు అనుమతులు ఇచ్చినట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు. అయితే కాలువలు నిర్మాణం చేపట్టినప్పుడు రోడ్డు నిర్మాణంలో అధి కారులు సూచించిన మార్కింగ్ వరకు కాకుండా వారికి ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు చేపట్టారు. దీంతో పలువురు కాలువల పైనే నిర్మాణాలు చేపట్టడంలో బస్టాండు ఏరి యా మొత్తం ద్విచక్రవానాలతో నిండిపోతుంది. అంతేకా కుండా కనీసం ఒక వాహనం వెళ్లేందుకు కూడా చోటు లేకుండా పోయింది. దీంతో ప్రజలు బస్టాండు సమీపంలో నడక దారిన వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటు న్నారు. ఇలా ఆక్రమణలతోనే తాము ఇబ్బందులు పడుతు న్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు.