ఇదేనండీ.. మన ఆర్టీసీ బస్సు
ABN , First Publish Date - 2023-04-29T23:45:22+05:30 IST
‘‘బండి కాదు మొండి ఇది... సాయం పట్టండి’’ అంటూ పీలేరు ఆర్టీసీ సిబ్బంది బస్సు ఎక్కిన ప్రయా ణికులను సాయం కోరిన సంఘటన శనివా రం పీలేరు బస్టాం డులో జరిగిం ది.
పీలేరు, ఏప్రిల్ 29: ‘‘బండి కాదు మొండి ఇది... సాయం పట్టండి’’ అంటూ పీలేరు ఆర్టీసీ సిబ్బంది బస్సు ఎక్కిన ప్రయా ణికులను సాయం కోరిన సంఘటన శనివా రం పీలేరు బస్టాం డులో జరిగిం ది. బస్సులను సరైన కండీషనలో పెట్టుకోవాలని అధికారులు సూచించిన నాలుగు రోజుల్లోనే ఈ సంఘటన జరగడం విశే షం. పీలేరు నుంచి సదుం వెళ్లే బస్సును శనివారం ఉదయం పాయింట్‌లో నుంచి బయలుదేరే సమయంలో బస్సు మొరాయించ డంతో డ్రైవర్, కండక్టర్ ప్రయాణికుల సాయం తో దానిని తోయించి స్టార్ట్ చేసుకున్నారు. గత కొంత కాలంగా ఇటు వంటి దృశ్యాలు మరిచి పోయిన పీలేరు వాసులు ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోయారు.