టూరిస్ట్ బస్సు, లారీ ఢీ - ఇరువురి మృతి
ABN , First Publish Date - 2023-09-22T00:15:59+05:30 IST
అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం దేవపట్ల సమీపంలో గురువారం రాత్రి టూరిస్సు బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కడ ప, తిరుపతి ఆస్పత్రులకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి.
40 మందికిపైగా గాయాలు
10 మంది పరిస్థితి విషమం
రాయచోటి టౌన్/సంబేపల్లె, సెప్టెంబరు 21: అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం దేవపట్ల సమీపంలో గురువారం రాత్రి టూరిస్సు బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కడ ప, తిరుపతి ఆస్పత్రులకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, కర్నూలు జిల్లా వెల్దు ర్తి, అనంతపురం జిల్లా సింగనమల, వనపర్తి జిల్లా కొత్తకోట ప్రాంతీయులు ఓ ట్రావెల్స్ బస్సులో సుమారు 40 మంది తమి ళనాడు ప్రాంతంలోని పలు పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ప్రొ ద్దుటూరు నుంచి టూరిస్టు బస్సును బుక్ చేసుకుని బయలు దేరారు. బస్సు దేవపట్ల వద్దకు చేరుకోగానే తమిళనాడు వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ బస్సును ఢీకొంది.
ప్రమాదంలో బస్సు డ్రైవర్ వెంకట నారాయణ (37), తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని పోలీసులు ఎక్స్‌కవేటర్ సాయం తో బయటకు తీశారు. ప్రొద్దుటూరుకు చెందిన సుధాకర్, పార్వతమ్మ, షబ్బీర్, జమ్మలమడుగుకు చెందిన వంశీకృష్ణ, సులోచన, ఎర్రగుంట్లకు చెందిన సిలార్‌బీ, కర్నూలు జిల్లా వెల్దు ర్తికి చెందిన రమాదేవి, నవీన, అనంతపురం జిల్లా సింగనమ లకు చెందిన సుబ్బలక్షుమ్మ, తొండూరుకు చెందిన సరళ, సరస్వ తి, వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన రమాదేవిలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 ద్వారా రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏరియా వైద్యులు వీరికి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కడప, తిరుపతికి తరలించారు. ఈ మేరకు రాయచోటి డీఎస్పీ మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్‌ఐలు, పోలీసులు హుటాహుటిన రాయచోటి ప్రభుత్వా స్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.