Share News

పొట్టి శ్రీరాములుకు నివాళి

ABN , Publish Date - Dec 15 , 2023 | 11:03 PM

అమర జీవి పొట్టిశ్రీరాములు వర్ధంతి సందర్భంగా 11వ బెటాలియనలో శుక్రవారం అడిషనల్‌ కమాండెంటు కె.ప్రభుకుమార్‌ నివాళులర్పించారు

పొట్టి శ్రీరాములుకు నివాళి
రాజంపేట: నివాళులు అర్పిస్తున్న టీడీపీ నేతలు

సిద్దవటం, డిసెంబరు 15: అమర జీవి పొట్టిశ్రీరాములు వర్ధంతి సందర్భంగా 11వ బెటాలియనలో శుక్రవారం అడిషనల్‌ కమాండెంటు కె.ప్రభుకుమార్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవత రణ కోసం అమరజీవి త్యాగం చిరస్మరణీయని కొనియాడారు. అసిస్టెంట్‌ కమాండెంట్లు వి.కేశవరెడ్డి, వి.జయ ప్రసాద్‌, డీఎస్పీ అసిస్టెంట్‌ కమాండెంటు కె.వెంకటరెడ్డి, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.

రైల్వేకోడూరు: పట్టణంలో బీజేపీ నాయకులు పొట్టిశ్రీరాములు విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు వాచర్ల సుబ్బారావు, రాష్ట్ర కౌన్సిల్‌ మాజీ సభ్యుడు శంకర్‌రాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఊటుకూరు చలపతి, సీనియర్‌ నాయకులు గౌరీకుమార్‌, మణి, రాజు తదితరులు పాల్గొన్నారు.

రాజంపేట:పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించారు. డీఆర్‌ఎల్‌ మణి, గన్నె సుబ్బనరసయ్య, అబూబకర్‌, టి.సంజీవరావు, అద్దేపల్లి ప్రతాప్‌రాజు, ఇడిమడకల కుమార్‌, మనుబోలు వెంకటేశ్వర్లు, బాసినేని వెంకటేశ్వర్లు, పీరు సాహెబ్‌, ఆనంద్‌, బాలాజీ, పాలప్రకాష్‌, చింతల హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2023 | 11:03 PM