ప్రపంచ రాక్‌స్టార్‌.. ప్రధాని నరేంద్రమోదీ

ABN , First Publish Date - 2023-06-27T23:37:03+05:30 IST

భారత ప్రజల గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింపజేసిన భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచ రాక్‌ స్టార్‌గా నిలిచారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు.

ప్రపంచ రాక్‌స్టార్‌.. ప్రధాని నరేంద్రమోదీ
మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్‌ మాధవ్‌

బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్‌

రాయచోటిటౌన్‌, జూన్‌ 27: భారత ప్రజల గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింపజేసిన భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచ రాక్‌ స్టార్‌గా నిలిచారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం రాయచోటి పట్టణంలోని ఎస్‌ఎన్‌కాలనీలో బీజేపీ రాయచోటి అసెంబ్లీ కన్వీనర్‌ అరమాటి శివగంగిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఏవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌ మాట్లాడుతూ కుటుంబ రాజకీయాలను పారద్రోలి భారతదేశాన్ని ప్రపంచంలోనే ఐదవ స్థానంలో నిలిపిన ఘనత మోదీదేనన్నారు. గడిచిన 9 సంవత్సరాల పాలనలో ప్రజా రంజకమైన సంక్షేమ పాలనను అందించి దేశాన్ని అగ్రభాగంలో నిలిపారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో దేశంలో ఎక్కడ చూసినా ఉగ్రవాదం, నక్సలిజం, కుంభకోణాలు విపరీతంగా ఉండేవని, బీజేపీ అధికారంలోకి వచ్చాక నక్సలిజాన్ని, ఉగ్రవాదాన్ని రూపుమాపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జోనల్‌ ఇన్‌చార్జి వెంకటశివనారాయణ, జిల్లా ఇన్‌చార్జి చంద్రమౌళి, జిల్లా సంయోజక్‌ సాయిలోకేశ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘురామిరెడ్డి, నాగరెడ్డెమ్మ, గోపాల్‌రెడ్డి, యువమోర్చ జాతీయ కార్యదర్శి సురేశ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేంద్రకుమార్‌రెడ్డి, చీర్ల శ్రీనివా్‌సయాదవ్‌, అసెంబ్లీ కన్వీనర్లు చెంగల్‌రాజు అన్ని ప్రాంతాల బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-27T23:37:21+05:30 IST