నిత్యపూజ స్వామికి పూజలు
ABN , First Publish Date - 2023-05-23T00:09:23+05:30 IST
మండలంలోని లంకమల అభయారణ్యంలో కొలువుదీరిన నిత్యపూజయ్య స్వామి ఆలయంలో సోమవారం కార్యనిర్వహణ అధికారి, ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలలు నిర్వహించారు.
సిద్దవటం, మే 22: మండలంలోని లంకమల అభయారణ్యంలో కొలువుదీరిన నిత్యపూజయ్య స్వామి ఆలయంలో సోమవారం కార్యనిర్వహణ అధికారి, ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి నిత్యపూజ స్వామికి పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది చంద్ర, భక్తులు పాల్గొన్నారు.