యువగళం పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ సిద్ధం

ABN , First Publish Date - 2023-02-25T23:11:26+05:30 IST

తంబళ్లపల్లె నియోజకవర్గంలో మార్చి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనున్న టీడీపీ జాతీయ ప్రధా న కార్యదర్శి నారా లోకేశ యువగళం పాదయాత్రకు రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు.

యువగళం పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ సిద్ధం
రూట్‌ మ్యాప్‌ను పరిశీలిస్తున్న రూట్‌ మ్యాప్‌ టీం, టీడీపీ శ్రేణులు

విరామం..సభలకు స్థలాల పరిశీలన

ములకలచెరువు, ఫిబ్రవరి 25: తంబళ్లపల్లె నియోజకవర్గంలో మార్చి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనున్న టీడీపీ జాతీయ ప్రధా న కార్యదర్శి నారా లోకేశ యువగళం పాదయాత్రకు రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గంలోని కురబలకోట, బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు మండలాల్లో యువగళం పాదయాత్ర జరగనుండడంతో నాలుగు మండలాల్లో విడిది, విరామం, సభల కోసం రాష్ట్ర రూట్‌ మ్యాప్‌ టీం సభ్యులు, నియోజకవర్గ టీడీపీ శ్రేణులు శనివారం స్థలాలను పరిశీలించారు. కురబలకోట మండల అమ్మచెరువుమిట్ట, కంటేవారిపల్లె, బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్‌, గుమ్మసముద్రం, పెద్దతిప్పసముద్రం మండలం మల్లెల క్రాస్‌, పీటీఎం, కమ్మవారిపల్లె, పులికల్లు, ములకలచెరువు సమీపంలోని కల్యాణమండపం వద్ద స్థలం పరిశీలించారు. తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి శంకర్‌యాదవ్‌ సూచనలతో రూట్‌ మ్యాప్‌ సభ్యులతో పాటు నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు పాలగిరి సిద్ధా, నారాయణస్వామిరెడ్డి, శ్రీనివాసులు, ఆనందరెడ్డి, నియోజకవర్గ నేతలు కుడుం శ్రీనివాసులు, వైజీ రమణ, క్లస్టర్‌ ఇనచార్జిలు చెన్నక్రిష్ణా, తనకంటి ప్రసాద్‌, నియోజకవర్ల తెలుగు యువత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనాధరెడ్డి, సుదర్శనరెడ్డి తదితరులు రూట్‌ మ్యాప్‌ను, స్థలాలను పరిశీలించి ఎంపిక చేశారు. మదనపల్లె నియోజకవర్గం నుంచి మార్చి 11న తంబళ్లపల్లె నియోజకవర్గంలోకి నారా లోకేశ పాదయాత్ర ప్రవేశించనుంది. అనంతరం మార్చి 12, 13 తేదీల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపఽథ్యంలో పాదయాత్రకు విరామం ప్రకటించనున్నారు. ఈ రెండు రోజుల పాటు నారా లోకేశ నియోజకవర్గంలోనే ఉండనున్నారు. మార్చి 17న ములకలచెరువు మండలంలో పాదయాత్ర ముగిసి 18న శ్రీసత్యసాయి జిల్లాలోకి ప్రవేశించనుంది.

Updated Date - 2023-02-25T23:11:28+05:30 IST