న్యాయవాది రజనీకి కోడికత్తి శ్రీను సోదరుడు వీడియో సందేశం..
ABN , First Publish Date - 2023-08-02T13:33:35+05:30 IST
నసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, న్యాయవాది రజనీకి కోడి కత్తి కేసు నిందితుడు శ్రీను సోదరుడు సుబ్బరాజు ఓ వీడియో పంపాడు. ఆ వీడియోలో శ్రీను తన తల్లి దీన పరిస్థితిని వివరించారు.
అమరావతి : జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, న్యాయవాది రజనీకి కోడి కత్తి కేసు నిందితుడు శ్రీను సోదరుడు సుబ్బరాజు ఓ వీడియో పంపాడు. ఆ వీడియోలో శ్రీను తన తల్లి దీన పరిస్థితిని వివరించారు. జైలులోనే ఐదేళ్లుగా తన తమ్ముడు ఉన్నాడని, బెయిల్ ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
తమకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశం కల్పిస్తే అండగా ఉండాలని వేడుకుంటామని శ్రీను తెలిపాడు. తన తమ్ముడిని బెయిల్‌పై బయటకు పంపేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరాడు. తన తల్లి కొడుకు కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తూనే ఉందన్నాడు. తన తల్లికి మాట్లాడటం రాకపోయినా.. ఆమె ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరాడు. పవన్ కల్యాణ్ నుంచి డబ్బుల సాయం అక్కర్లేది.. తన సోదడురు శ్రీను ఐదేళ్లుగా జైలులోనే ఉంటున్నానని సుబ్బరాజు తెలిపాడు. హత్యలు చేసిన వాళ్లు మాత్రం దర్జాగా బెయిల్ పై బయట తిరుగుతున్నారన్నారు. తన తమ్ముడు చేసిన పాపం ఏంటి? న్యాయ నిపుణులు అయినా తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నామని శ్రీను వీడియోలో తెలిపాడు.