‘కోర్టు రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించకుంటే కోడికత్తి శ్రీను నిరాహారదీక్ష చేస్తాడట’

ABN , First Publish Date - 2023-07-04T12:21:06+05:30 IST

కోడికత్తి కేసులో విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ కేసును ఈ నెల 11కు ఎన్ఐఏ న్యాయమూర్తి వాయిదా వేశారు. కేసు విచారణ అనంతరం కోడికత్తి కేసు నిందితుడు శ్రీను తరుఫు న్యాయవాది అబ్దుల్ సలీం మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో ఐదు సంవత్సరాల నుంచి శ్రీనివాస్ జైల్లోనే మగ్గుతున్నాడన్నారు.

‘కోర్టు రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించకుంటే కోడికత్తి శ్రీను నిరాహారదీక్ష చేస్తాడట’

విజయవాడ : కోడికత్తి కేసులో విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ కేసును ఈ నెల 11కు ఎన్ఐఏ న్యాయమూర్తి వాయిదా వేశారు. కేసు విచారణ అనంతరం కోడికత్తి కేసు నిందితుడు శ్రీను తరుఫు న్యాయవాది అబ్దుల్ సలీం మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో ఐదు సంవత్సరాల నుంచి శ్రీనివాస్ జైల్లోనే మగ్గుతున్నాడన్నారు. ఈ నెల 11 వరకు తనకు కోర్టు రెగ్యులర్ షెడ్యూల్‌ను ప్రకటించాలన్నారు.

రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించకపోతే నిందితుడు శ్రీనివాస్ నిరాహార దీక్ష చేస్తానంటున్నాడని వెల్లడించారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఘటన జరిగిన సమయంలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులు, వైసీపీ వాళ్ళు అక్కడ ఉన్నారని శ్రీనివాస్ అంటున్నాడన్నారు. తనకు రెగ్యులర్ షెడ్యూల్ ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నిస్తున్నాడని తెలిపారు. స్పీడ్ ట్రైల్ జరిపించాలంటూ శ్రీనివాస్ కోర్టును అభ్యర్థిస్తున్నాడని అబ్దుల్ సలీం వెల్లడించారు.

Updated Date - 2023-07-04T12:21:06+05:30 IST