Kotamreddy : నియంతల పాలనలో ఉన్నామా? ప్రజాస్వామ్య పాలనలోనా?

ABN , First Publish Date - 2023-05-23T10:53:01+05:30 IST

క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం రూరల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా అలుపెరగని పోరాటం చేశానన్నారు. నాలుగేళ్లలో సీఎం జగన్ స్వయానా మూడు సార్లు ముచ్చటగా సంతకాలు చేసినా నిధులు విడుదల కాలేదన్నారు. గత నెలరోజులుగా క్రైస్తవ సోదరులతో పోస్ట్ కార్డు, మెసేజ్ పోస్టింగ్ ఉద్యమం చేపట్టినా ప్రయోజనం లేదన్నారు.

Kotamreddy : నియంతల పాలనలో ఉన్నామా? ప్రజాస్వామ్య పాలనలోనా?

నెల్లూరు : క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం రూరల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా అలుపెరగని పోరాటం చేశానన్నారు. నాలుగేళ్లలో సీఎం జగన్ స్వయానా మూడు సార్లు ముచ్చటగా సంతకాలు చేసినా నిధులు విడుదల కాలేదన్నారు. గత నెలరోజులుగా క్రైస్తవ సోదరులతో పోస్ట్ కార్డు, మెసేజ్ పోస్టింగ్ ఉద్యమం చేపట్టినా ప్రయోజనం లేదన్నారు. గాంధీగిరి తరహా నిరసన కార్యక్రమం చేపడుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. శాంతియుత నిరసనలని శాంతిభద్రతలకి విఘాతం అనడం విడ్డూరమని కోటంరెడ్డి పేర్కొన్నారు.

ఇంకా కోటంరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఐదు శాతం పూర్తి కాక గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం నిలిచిపోయింది. 10 వేల మందికి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వాడ ఆగిపోయింది. గత టీడీపీ ప్రభుత్వం రూ.42కోట్లుతో 542 ఎకరాల భూమిని సేకరించింది. పోలీసులని ఇంటి వద్దకు పంపి ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. నియంతల పాలనలో ఉన్నామా? ప్రజస్వామ్య పాలనలో ఉన్నామో అర్థం కావడంలేదు. అరెస్టులు, కేసులు, లాఠీలు, లాకప్పులు, తుపాకులు, తూటాలు, కర్ఫ్యూలు, అక్రమ కేసులతో ప్రజా ఉద్యమాలని ఆపలేరు. భవిష్యత్తులో గెరిల్లా ఆందోళనలు చేపడుతాం. పోలీసులు సైతం ఎన్నికలు ఎప్పుడొస్తాయా? అని ఎదురు చూస్తున్నారు. ప్రజా ఉద్యమాలని అడ్డుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు రాదు. వైసీపీ వారు నడిరోడ్లలో అడ్డగోలుగా మీటింగులు పెడుతుంటే రాని ఇబ్బందులు ప్రతిపక్షాలకే వస్తాయా? అరచేతితో సూర్యకిరణాలు ఆపలేనట్టు, అణిచివేతలతో ప్రజాఉద్యమాలని ఆపలేరు. ఇదే రీతిన గత ప్రభుత్వం వ్యవహారించి ఉంటే, మనం ప్రజా ఉద్యమాలు చేయగలిగే వారమా?’’ అని ప్రశ్నించారు.

Updated Date - 2023-05-23T10:59:47+05:30 IST