Home » Kotamreddy Sridhar Reddy
Nara Lokesh: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొత్త వరవడిని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సృష్టించారు. ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
Kotamreddy Sridharreddy: టీడీపీ మద్ధతుతో ముస్లిం మైనార్టీ మహిళా కార్పోరేటర్ సయ్యద్ తహసిన్ భారీ మెజార్టీతో గెలుపొందడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మంత్రి నారాయణ ఆలోచనతో మైనార్టీ అభ్యర్థినికి అవకాశం ఇచ్చారని.. తాను బలపరచినట్లు తెలిపారు.
Kotamreddy Sridhar Reddy: ‘‘నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చా. విద్యార్ధి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నా. ప్రజల ఆధరణని మరువలేను. సౌత్ మోపూరు, ములుమూడి నాకు రెండు కళ్లు. పార్టీలకంటే నాకు సొంతంగా ఓట్లు ఎక్కువ. సౌత్ మోపూరు అంటే నాకు చాలా అభిమానం. ఇక్కడి ప్రజలు అగ్గిపెట్టె నుంచి అణుబాంబు వరకు, గ్రామం నుంచి ప్రపంచం వరకు ఏదైనా చెప్పగలరు‘‘ అంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు.
సభా నాయకుడిపైనే ఇలాంటి కుట్ర జరిగితే మరి మామూలు జనం పరిస్థితి ఏంటనేది ఆలోచించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఇది ముఖ్యమైన అంశమని, దీనిపై తప్పనిసరిగా చర్చించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కూడా అన్నారు.
జగన్‌ను చూసి చాలా రోజులు అవుతుంది.. కానీ ఆయన మాత్రం అసెంబ్లీకి రావడం లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. దీనికి పరిష్కారం ఏంటంటే.. రోజుకు జగన్‌కు గంట మాట్లాడేందుకు సమయం ఇస్తే వస్తారన్నారు. ఇంకొ విషయం ఏంటంటే.. ఆయన ఏం మాట్లాడినా అద్దం రాకూడదని.. ఇది జగన్ ఫిలాసఫీ అని అన్నారు.
వైసీపీ హయాంలో ఇసుక ట్రాక్టర్లకు లోడ్ చేసేవాళ్ళు కాదని, టిప్పర్లు లోడ్ చేసేవాళ్ళని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. ఎందుకంటే ట్రాక్టర్లు పేదోళ్ళవి.. టిప్పర్లు ముఖ్యమంత్రివి.. ఇసుక టిప్పర్లు టచ్ చేస్తే సీఎం కార్యాలయం నుంచి కాల్ చేసే వాళ్లని.. ఎస్పీలు, కలెక్టర్లు ఏజంట్లుగా పని చేశారని ఆరోపించారు. అందుకే 11 సీట్లు ఇచ్చి జనం ఛీ కొట్టారన్నారు.
నెల్లూరు జిల్లాలో మాస్ పొలిటీషియన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాజకీయాల్లో ఆయన స్టైలే వేరు. తాను నమ్మిన వ్యక్తుల కోసం ఎంతకైనా తెగిస్తారు. తనను అనుమానించినా.. అవమానించినా ఆత్మగౌరవాన్ని చంపుకుని ఒక్కనిమిషం ఉండరు.
Andhrapradesh: ‘‘రొట్టెల పండుగ మీద పూర్తి విశ్వాసం కల్గిన వ్యక్తి నేను’’ అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం స్వర్ణాల చెరువులో సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం కావాలని ఎమ్మెల్యే రొట్టెలు పట్టుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... దర్గాలో పూజలు చేసి రొట్టెలు పట్టుకుంటే సంకల్పం నెరవేరుతుందని స్వయంగా చంద్రబాబే చెప్పారన్నారు.
ఏపీ ఎన్నికల్లో ఓటమి అనంతరం వైసీపీ వికెట్స్ ఒక్కొక్కటిగా పడుతున్నాయి. ఇవాళ నెల్లూరు మేయర్ స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ.. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా తనకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేటర్ టికెట్‌ను ఇచ్చారని.. గెలిచిన మీదట తనను మేయర్‌ను చేశారని తెలిపారు.
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన ఆయన.. మంత్రి పదవిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన.. మూడోసారి గెలుపొందారు. ఈ సందర్భంగా బుధవారం నాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అనేక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.