13 కేజీల బంగారం సీజ్‌

ABN , First Publish Date - 2023-05-12T00:47:07+05:30 IST

చెన్నై నుంచి విజయవాడకు వస్తున్న స్మగ్లింగ్‌ బంగారాన్ని కస్టమ్స్‌ (ప్రివెంటివ్‌) అధికారులు సీజ్‌ చేశారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి 13 కిలోల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

13 కేజీల బంగారం సీజ్‌

విజయవాడ, మే 11 (ఆంధ్రజ్యోతి) : చెన్నై నుంచి విజయవాడకు వస్తున్న స్మగ్లింగ్‌ బంగారాన్ని కస్టమ్స్‌ (ప్రివెంటివ్‌) అధికారులు సీజ్‌ చేశారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి 13 కిలోల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి విజయవాడకు వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులను గుంటూరు జిల్లా కాజా టోల్‌ప్లాజా, బొల్లపల్లి టోల్‌ప్లాజా వద్ద బుధవారం తనిఖీ చేశారు. నలుగురు వ్యక్తులు ఈ బంగారం బిస్కెట్లను బ్యాగుల్లో పెట్టుకుని తీసుకు వస్తున్నారు. వాటిని పరిశీలించగా, అందులో విదేశీ మార్క్‌ చేసి ఉంది. గుర్తించిన అధికారులు బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకుని, నలుగురు వ్యక్తులను విశాఖపట్నంలోని ఆర్థిక నేరాల విచారణ కోర్టులో గురువారం హాజరుపరిచారు. ఈ బంగారం విలువ రూ.7.78 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.32.8 కోట్ల విలువచేసే 59.5 కిలోల బంగారాన్ని సీజ్‌ చేశామని కస్టమ్స్‌ కమిషనర్‌ ఇంజనీర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2023-05-12T00:47:07+05:30 IST