సంక్షేమం అంతా జగన్ పత్రిక ప్రకటనల్లోనే..
ABN , First Publish Date - 2023-05-20T00:40:41+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెబుతున్న సంక్షేమం, అభివృద్ధి అంతా సాక్షి పత్రికకు ఇచ్చే ప్రకటనల్లోనే కనిపిస్తుంది తప్ప వాస్తవంగా రాష్ట్రంలో ఎక్కడా కనిపించదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.
సంక్షేమం అంతా జగన్ పత్రిక ప్రకటనల్లోనే..
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
మాచవరం, మే 19 : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెబుతున్న సంక్షేమం, అభివృద్ధి అంతా సాక్షి పత్రికకు ఇచ్చే ప్రకటనల్లోనే కనిపిస్తుంది తప్ప వాస్తవంగా రాష్ట్రంలో ఎక్కడా కనిపించదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 6వ డివిజన్లో శుక్రవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ఇంటింటికి వెళ్లి స్థానికుల సమస్యలను అడిగి తెలుసు కున్నారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విద్యార్థి గుడిపూడి సాయితేజ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యు లను పరామర్శించి, వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 25 వేలు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో మంచి ఆశయంతో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెడితే, జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదని ఆరోగ్య శ్రీ పథకం నుంచి ఆస్పత్రి యాజమాన్యాలు ఉపసంహరించుకున్నారని పేర్కోన్నారు. వైసీపీ ప్రభుత్వం గద్దె దిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. నేతలు పడాల గంగాధర్, మోహనరావు, రామినాయుడు, దుర్గారావు పాల్గొన్నారు