అసాంఘిక శక్తుల ఆగడాలను అరికట్టాలి
ABN , First Publish Date - 2023-02-11T00:49:58+05:30 IST
బొమ్మల కళాకారులు నివ సించే కాలనీలో అసాంఘికశక్తుల చేస్తున్న ఆగడాలను పోలీసులు అరికట్టాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 10: బొమ్మల కళాకారులు నివ సించే కాలనీలో అసాంఘికశక్తుల చేస్తున్న ఆగడాలను పోలీసులు అరికట్టాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కొండపల్లి బొమ్మలకాలనీ 28వ డివిజన్‌లో శుక్రవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ హస్తకళల కళాకారులు నివాస ప్రాంతంలో అభివృద్ధి లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బొమ్మల కళాకారుల జీవన ప్రమాణాలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, లోకేష్‌బాబు పాదయాత్ర, తన మీద తాడేపల్లిలో రాసిన స్ర్కీప్టు చదివేశారన్నారు. అసత్య ఆరోపణలు చేయటాన్ని మైలవరం నియోజకరవ్గ ప్రజలు కోరుకోవటం లేదని చింతలపూడి ప్రాజెక్టు పూర్తి చేయాలని, ఐకానిక్ బ్రిడ్జి పూర్తి చేయాలని, పట్టీసీమ నీరు కృష్ణాకు తీసుకురావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. కొండపల్లిలో ఇంటంటికి కుళాయి నిధులు వెనక్కి ఎందుకు పంపారని ఎమ్మెల్యేని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, కౌన్సిలర్స్ పాల్గొన్నారు.