అర్జీదారుల సంతృప్తే లక్ష్యం

ABN , First Publish Date - 2023-04-11T00:49:03+05:30 IST

సమస్యలను పరిశీలించి పరిష్కారం చూపాలని, అర్జీదారుల సంతృప్తే లక్ష్యమని మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు.

అర్జీదారుల సంతృప్తే లక్ష్యం

అర్జీదారుల సంతృప్తే లక్ష్యం

స్పందనలో

మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి

చిట్టినగర్‌, ఏప్రిల్‌ 10 : సమస్యలను పరిశీలించి పరిష్కారం చూపాలని, అర్జీదారుల సంతృప్తే లక్ష్యమని మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం స్పందన నిర్వహించారు. నగర ప్రజల నుంచి మేయర్‌, కమిషనర్‌ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంలో మేయర్‌ మాట్లాడుతూ స్పందనలో నమోదయ్యే అర్జీలను నిర్ధేశించిన గడువులోగా పరిష్కరించాలని సూచించారు. శాఖల వారీగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పెండింగ్‌ లేకుండా పరిశీలించి వాటిని క్షేత్రస్థాయిలో వెంటనే పరిష్కరించాలన్నారు. స్పందనలో సోమవారం 20 అర్జీలు వచ్చాయని మేయర్‌ తెలిపారు. అదనపు కమిషనర్‌ (జనరల్‌) ఎం. శ్యామల, అదనపు కమిషనర్‌ (ప్రాజెక్ట్స్‌) కేవీ సత్యవతి, చీఫ్‌ ఇంజనీర్‌ ఎం. ప్రభాకరరావు, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పి. రత్నావళి, సిటీ ప్లానర్‌ జీవీజీఎస్‌వీ ప్రసాద్‌, డిప్యూటీ కమిషనర్‌ (రెవెన్యూ) డి. వెంకటలక్ష్మి, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (యూసీడీ) శకుంతల, జాయింట్‌ డైరెక్టర్‌ (అమృత్‌) డాక్టర్‌ కేబీఎన్‌ఎస్‌ లతా, సెక్రటరీ కె. వసంత లక్ష్మి, ఏడీహెచ్‌ శ్రీనివాసు, ఎస్టేట్‌ ఆఫీసర్‌ కె. అంబేడ్కర్‌, మేనేజర్‌ బి. శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.ఫ జోనల్‌ కమిషనర్లు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సర్కిల్‌-2లో ఒక అర్జీ స్వీకరించారు. సర్కిల్‌-1, సర్కిల్‌-3 కార్యాలయాల నుంచి ఎటువంటి అర్జీలు అందనట్లు జోనల్‌ కమిషనర్లు తెలియజేశారు.

కారుణ్య నియామకాలు

కారణ్య నియామకం కింద సోమవారం ఇద్దరికి నియామక ఉత్తర్వులు అందజేసినట్లు మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. కారుణ్య నియామక ఉత్తర్వులను మేయర్‌ భాగ్యలక్ష్మి, కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ చేతుల మీదుగా ఇద్దరికి అందజేశారు. ఈ సందర్భంలో కమిషనర్‌ మాట్లాడుతూ విద్యార్హత లను బట్టి జూనియర్‌ అసిస్టెంట్‌ (కండిషనల్‌ బేసిస్‌), ఆఫీసు సబార్డినేటర్‌ పోస్టింగ్‌లను కేటాయించినట్లు తెలిపారు.

లోటస్‌ ల్యాండ్‌ మార్క్‌ సెక్టార్‌- 1లో నడకకు అనుమతివ్వండి

వన్‌టౌన్‌: లోటస్‌ ల్యాండ్‌ మార్క్‌ సెక్టార్‌-1లోని వాకింగ్‌ ట్రాక్‌లో వాకింగ్‌కు అను మతి ఇవ్వాలని సెక్టార్‌ -2 లోని వాకర్స్‌ ఇంటర్నేష నల్‌ అనుబంధ మైత్రీలోటస్‌ వాకర్స్‌ అఫిలియేటెడ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సోమవారం మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన స్పందనలో కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌కు వినతిపత్రం ఇచ్చారు అసోసియేషన్‌ అధ్యక్షుడు కే.ప్రసాదరావు తదితరులు కమిషనర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ స్పందించి సంబంధిత అధికారులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని, మునిసిపల్‌ స్థలంలో అడ్డంకులు ఉంటే తొలగించాలని సూచించారు.

Updated Date - 2023-04-11T00:49:03+05:30 IST