Balineni Issue : ధనుంజయ్ రెడ్డితో బాలినేని భేటీ.. ఎందుకింత క్షోభ..?
ABN , First Publish Date - 2023-10-19T15:17:18+05:30 IST
అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సిఎంవో ముఖ్య కార్యదర్శి ధనుంజయ్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఒంగోలులో భూ కబ్జా వ్యవహారంపై ఆయనతో చర్చిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి క్షోభను ఎప్పుడూ అనుభవించలేదని అన్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన ఒంగోలు ఎమ్మెల్యే , మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivasa Reddy) సిఎంవో (CMO) ముఖ్య కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి (Dhanunjay Reddy)తో సమావేశం అయ్యారు. ఒంగోలు (Ongole)లో భూ కబ్జా (Land Grab) వ్యవహారంపై ఆయనతో చర్చిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి క్షోభను ఎప్పుడూ అనుభవించలేదని అన్నారు. ఎమ్మెల్యేకి తెలియకుండానే భూకబ్జా జరుగుతుందా? అని ప్రజలు అనుమానిస్తున్నారని ధనుంజయ్ రెడ్డికి బాలినేని చెప్పారు. భూకబ్జా దోషులను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు. తన అనుచరులు ఉన్నా చర్యలు తీసుకోమని చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. నిస్పాక్షికంగా వ్యవహరించాలని కలెక్టర్ , ఎస్‌పీలను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఒంగోలులో భూకబ్జా పూర్వపరాలను ధనుంజయ్ రెడ్డికి బాలినేని శ్రీనివాస రెడ్డి వివరించారు.
కాగా రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో పోలీసుల తీరుని నిరశిస్తూ గన్‌మెన్‌లను బాలినేని శ్రీనివాస రెడ్డి సరెండర్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి పోలీసు ఎస్కార్ట్ వాహనం, గన్ మెన్‌లు లేకుండానే తాడేపల్లికి బాలినేని వచ్చారు. ధనుంజయ రెడ్డితో భేటీ అనంతరం సాయంత్రం 3 గంటలకు సీఎం జగన్‌ని కలిసే అవకాశం ఉంది. మంత్రి పదవి కోల్పోయినప్పటి నుంచి వైసీపీలో ప్రాధాన్యత తగ్గిందనే భావనలో బాలినేని ఉన్నారు. పార్టీలో, ప్రభుత్వ అధికారుల వద్ద తన మాటకి విలువ లేకుండా పోయిందని సన్నిహితుల వద్ద బాలినేని అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.