భారతీయ ఔన్నత్యానికి ప్రతీక భగవద్గీత

ABN , First Publish Date - 2023-04-29T01:17:53+05:30 IST

భారతీయ ఔన్నత్యానికి భగవద్గీత ప్రతీక అని సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. పొట్టిశ్రీరాములు చలువాది మల్లికార్జున రావు ఇంజనీరింగ్‌ కాలేజీలో శుక్రవారం ఎంఆర్కే మూర్తి రచించిన విశ్వజనీన గీత పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

భారతీయ ఔన్నత్యానికి ప్రతీక భగవద్గీత
విశ్వజనీన గీత పుస్తకావిష్కరణలో పాల్గొన్న తనికెళ్ల భరణి, ఎమ్యెల్యే వెలంపల్లి, కళాశాల నిర్వాహకులు

విశ్వజనీన గీత పుస్తకావిష్కరణలో నటుడు, రచయిత తనికెళ్ల భరణి

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 28: భారతీయ ఔన్నత్యానికి భగవద్గీత ప్రతీక అని సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. పొట్టిశ్రీరాములు చలువాది మల్లికార్జున రావు ఇంజనీరింగ్‌ కాలేజీలో శుక్రవారం ఎంఆర్కే మూర్తి రచించిన విశ్వజనీన గీత పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తొలి ప్రతిని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుకు అందించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. సమాజంపై సిని మా ప్రభావం బాగా ఉంటుందన్నారు. విద్యార్థులకు ప్రేరణ ఇచ్చేందుకు, వారిలోని సృజనకు పదును పెట్టేందుకు విశ్వజనీన గీత పుస్తకాన్ని తీసుకువచ్చినట్లు రచయిత ఎంఆర్కే మూర్తి తెలిపారు. కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు చలువాది మల్లికారు ్జనరావు, పి.లక్ష్మణస్వామి, ఉపాధ్యక్షుడు శ్రీరాం రాధాకృష్ణమూర్తి, కోశాధికారి కొత్త మాసు వెంకటేశ్వరరావు, కేబీఎన్‌ కళాశాల కార్యదర్శి తూనుకుంట్ల శ్రీనివాసులు ప్రసంగించారు. సాహితీవేత్త జేవీ చలపతిరావు అనుసంధానకర్తగా వ్యవహరించారు.

Updated Date - 2023-04-29T01:17:53+05:30 IST