పట్టాభి స్మారక భవనానికి ఎన్‌వోిసీ ఇవ్వాలి
ABN , First Publish Date - 2023-08-16T00:57:49+05:30 IST
స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి నగర పాలక సంస్థ వెంటనే ఎన్‌వోసీ ఇవ్వాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు.
వివిధ రాజకీయ పార్టీల నాయకుల ఆందోళన
మచిలీపట్నం టౌన్, ఆగస్టు 15 : స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి నగర పాలక సంస్థ వెంటనే ఎన్‌వోసీ ఇవ్వాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. జిల్లా పరిషత్ సెంటర్‌లోని పట్టాభి సీతారామయ్య విగ్రహం వద్ద నిర్వహించిన ఈ ఆందోళనలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, పట్టాభి స్మారక భవన నిర్మాణ సాధన సమితి సభ్యులు ఏ.ఆర్.కె. మూర్తి, వేమూరి రామకృష్ణారావు, పి.వి.ఫణికుమార్, వి.ఎస్.ఆర్. శర్మ, మోపర్తి సుబ్రహ్మణ్యంలతోపాటు జనసేన నాయకులు వంపుగడల చౌదరి, కొట్టె వెంకట్రావు, సుంకర ఏసు, సమీర్, మణిబాబు, వాకాలరావు పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆందోళనకారులు ప్రశ్నించారు. కలెక్టర్ రెండెకరాల స్థలం, యూనియన్ బ్యాంకు రూ.40 కోట్లు ఇచ్చినప్పటికీ నగర పాలక సంస్థ పాలకులు భవన నిర్మాణానికి ఎన్‌వోసి ఇవ్వకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.