కట్లేరుపై వంతెన నిర్మించండి

ABN , First Publish Date - 2023-02-13T00:52:35+05:30 IST

తోటమూల - వినగడప రహదారిలోని కట్లేరు వంతెన నిర్మాణం చేపట్టాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం రాస్తారోకో చేశారు.

కట్లేరుపై వంతెన నిర్మించండి
కట్లేరు వద్ద రాస్తారోకో చేస్తున్న సీపీఐ నేతలు

గంపలగూడెం : తోటమూల - వినగడప రహదారిలోని కట్లేరు వంతెన నిర్మాణం చేపట్టాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకుడు షేక్‌ నాగుల్‌మీరా మాట్లాడుతూ కట్లేరు వంతెన 2018లో కురిసిన భారీ వర్షాలకు కొట్టుకోయి ఆరేళ్లు కావస్తున్నా ఇంత వరకు నూతన వంతెన నిర్మాణం చేపట్టలేదన్నారు. దీంతో ఏడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గంపలగూడెం రావాలంటే అదనంగా 20కిలో మీటర్లు తిరిగి రావాల్సి వస్తుందని, కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగాఉందన్నారు. నాయకులు షేక్‌ కరిముల్లా, గౌర్రాజు రామకృష్ణ, కె.రామారావు, పి.ప్రభాకర్‌, బి.పూర్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-13T00:52:36+05:30 IST