ధర్మపోరాటంలో అంతిమ విజయం చంద్రబాబుదే

ABN , First Publish Date - 2023-10-09T00:42:13+05:30 IST

సీఎం జగన్మోహనరెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా ధర్మపోరాటంలో అంతిమ విజయం చంద్రబాబుదేనని టీడీపీ వన్‌టౌన్‌ క్లస్టర్‌ ఇన్‌చార్జి నందం భవానీప్రసాద్‌ అన్నారు.

ధర్మపోరాటంలో అంతిమ విజయం చంద్రబాబుదే
టీడీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో రిలే దీక్షల్లో పాల్గొన్న పార్టీ శ్రే ణులు

రిలే దీక్షలో టీడీపీ వన్‌టౌన్‌ క్లస్టర్‌ ఇన్‌చార్జి నందం భవానీప్రసాద్‌

వన్‌టౌన్‌, అక్టోబరు 8: సీఎం జగన్మోహనరెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా ధర్మపోరాటంలో అంతిమ విజయం చంద్రబాబుదేనని టీడీపీ వన్‌టౌన్‌ క్లస్టర్‌ ఇన్‌చార్జి నందం భవానీప్రసాద్‌ అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఎంఎస్‌ బేగ్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలేదీక్షలు ఆదివారం 25వ రోజుకు చేరాయి. 52వ డివిజన్‌ పార్టీ అధ్యక్షుడు ఆళ్ల మోహనరావు, ప్రధాన కార్యదర్శి గోలి శ్రీనివాసరావు, టీం టీడీపీ సభ్యులు పాల్గొన్నారు. పల్లంటి గంగాధర్‌, బండి వెంకటరమణ, ఈపీ కేశ వరావు, గంటా రాజు, దాసరి రమణ, మట్టి లక్ష్మి, పోతి న శ్రీనివాసరావు, సుకాశి సరిత, స్రవంతి, పిళ్లా రామ కృష్ణ దీక్షలో పాల్గొన్నారు.

చంద్రబాబుకు బాసటగా నిలవండి

భవానీపురం: చంద్రబాబు అరెస్టును ప్రజలు ముక్తకంఠంతో ఖండించి, ఆయనకు బాసటగా నిలవా లని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. 44వ డివిజన్‌ టీడీపీ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నాలుగు స్తంభాల సెంటర్‌లో ఎరుకుల బజార్‌, రాములవారిగుడి, నాగేం ద్రస్వామి గుడి రోడ్డుప్రాంతాల్లో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం చేశారు. పార్టీ ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇచ్చి మద్దతు పలకాలని కోరారు. వైసీపీ అకృత్యాలపై ప్రజలు పోరాటాలు చేయాలని వారు కోరారు. క్లస్టర్‌ ఇన్‌చార్జి బడుగు గణేష్‌, యూనిట్‌ ఇన్‌చార్జులు కుప్పిలి నాగబాబు, శ్రీనివాస రాజు, గుంజా ఏడుకొండలు, గుర్రాజు, జి.నాగరాజులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-09T00:42:13+05:30 IST