బాల్య వివాహాన్ని అడ్డుకున్న మహిళా పోలీస్
ABN , First Publish Date - 2023-05-12T01:15:33+05:30 IST
భోగిరెడ్డిపల్లిలో బాల్య వివాహాన్ని మహిళా పోలీసు నిలువరించింది.
మచిలీపట్నం టౌన్, మే 11 : భోగిరెడ్డిపల్లిలో బాల్య వివాహాన్ని మహిళా పోలీసు నిలువరించింది. బాల్యవివాహం చేసేందుకు ప్రయత్నిస్తున్న మురాల వెంకటేశ్వరరావు, లక్ష్మి వద్దకు మహిళా పోలీసు వీరంకి కీర్తి వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికకు వివాహం చేస్తే వచ్చే నష్టాలను అంగన్‌వాడీ కార్యకర్త జానకి, ఆశ వర్కర్లు వివరించి, నోటీసుఇచ్చారు. దీంతో బాల్య వివాహం ఆగిపోయింది.