డంపింగ్‌ యార్డు తరలించాలని ఆందోళన

ABN , First Publish Date - 2023-06-06T01:18:49+05:30 IST

పట్టణంలో ముక్త్యాల రోడ్డులో 14వ వార్డు సమీపంలో ని డంపింగ్‌ యార్డును వెంటనే వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్‌ చేస్తు వార్డు టీడీపీ కౌన్సిలర్‌ నకిరికంటి వెంకట్‌ ఆధ్వర్యంలో వార్డు ప్రజలు చెత్త ట్రాక్టర్లు డంపింగ్‌ యార్డులోకి రాకుండా అడ్డుకున్నారు.

 డంపింగ్‌ యార్డు తరలించాలని ఆందోళన
చెత్త ట్రాక్టర్లు రాకుండా డంపింగ్‌ యార్డు వద్ద ఆడ్డుకుంటున్న టీడీపీ కౌన్సిలర్‌ న కిరికంటి వెంకట్‌, స్థానికులు

జగ్గయ్యపేట, జూన్‌ 5 : పట్టణంలో ముక్త్యాల రోడ్డులో 14వ వార్డు సమీపంలో ని డంపింగ్‌ యార్డును వెంటనే వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్‌ చేస్తు వార్డు టీడీపీ కౌన్సిలర్‌ నకిరికంటి వెంకట్‌ ఆధ్వర్యంలో వార్డు ప్రజలు చెత్త ట్రాక్టర్లు డంపింగ్‌ యార్డులోకి రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్బంగా కౌన్సిలర్‌ వెంకట్‌ మాట్లాడుతూ, కాలుష్య నియంత్రణ మండలి అభ్యంతరాలు చెప్పినా, విలియంపేట, పద్మావతినగర్‌ వాసులు చెత్త తగలబడటం వల్ల వచ్చే పొగతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నా అధికారు ల్లో చలనం లేదని, ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులే నిబంధనలు ఉల్లంఘించి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. తహసీల్దార్‌ నాగరాజు ఇతర అధికారులు అక్కడకు వచ్చి కౌన్సిలర్‌తో చర్చించారు. పురపాలక సంఘం అధికారులు త్వరలోనే ప్రత్యామ్నాయంగా డంపింగ్‌ యార్డును చూస్తామని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు. ఏఎంసీ మాజీ డైరెక్టర్‌ మల్లెల కొండ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-06T01:18:49+05:30 IST