ప్రమాదానికి బ్రేకులు పడవా..
ABN , First Publish Date - 2023-04-17T00:59:26+05:30 IST
పదిమంది.. 20 మంది కాదు.. 50కి పైగా ప్రయాణికులతో ఎంత ప్రమాదకరంగా వెళ్తుందో చూడండి ఈ పడవ.
జగ్గయ్యపేట రూరల్ : పదిమంది.. 20 మంది కాదు.. 50కి పైగా ప్రయాణికులతో ఎంత ప్రమాదకరంగా వెళ్తుందో చూడండి ఈ పడవ. జగ్గయ్యపేట రూరల్ మండలంలోని ముక్త్యాల నుంచి కృష్ణానదిపై గుంటూరు జిల్లా మాదిపాడుకు నాటు పడవలు రోజూ ఇలాగే రాకపోకలు సాగిస్తున్నాయి. ఇలా వందలాది మందిని తరలిస్తున్నా పోలీస్, రెవెన్యూ పంచాయతీ అధికారులు కనీస చర్యలు తీసుకోవట్లేదు. నిబంధనల మేరకు నదిలో పడవ నడిపేందుకు 12 మందినే తరలించాల్సి ఉంది. బైకులకు అసలు అనుమతే లేదు. సదరు పడవ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ఫిట్‌నెస్, పడవ నడిపే వ్యక్తికి లైసెన్స్‌తో పాటు ప్రయాణికులకు సరిపడా లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉండాలి. ఇవేమీ పట్టకుండా పదుల సంఖ్యలో జనాలను నది దాటిస్తున్నారు. ముక్త్యాల వద్ద కృష్ణానదిలో లోతు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.