AP News: మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2023-11-17T10:24:44+05:30 IST
నాగులచవితి సందర్భంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
కృష్ణా: నాగులచవితి సందర్భంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తొలి పూజ చేసి పుట్టలో పాలు పోశారు. నాగుల చవితి సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలు అన్నింటినీ ఆలయ సిబ్బంది రద్దు చేశారు. కేవలం సర్వ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్వేశ్వర స్వామి ఆలయానికి తరలివస్తున్నారు.