Vijayawada: శివాలయాలకు పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2023-11-20T07:50:50+05:30 IST
విజయవాడ: కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక దామోదరుడుకి విశేష పూజలు చేస్తున్నారు. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో శివాలయాలు మారుమోగుతున్నాయి.
విజయవాడ: కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక దామోదరుడుకి విశేష పూజలు చేస్తున్నారు. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో శివాలయాలు మారుమోగుతున్నాయి. కార్తీక దామోదరుడికి బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు, పంచామృతాలతో అర్చకులు అభిషేకాలు చేస్తున్నారు. పంచారామ, శైవ క్షేత్రాలను భక్తులు సందర్శిస్తున్నారు. నది, సముద్ర స్నానాలను ఆచరించి కార్తీకదీపం వదులుతున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాల్లో 365 వొత్తులను వెలిగించుకొని మహిళలు ఉపవాసాలను ఆచరిస్తున్నారు. భక్తులు హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణ చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. భక్తులు సోమవారం తెల్లవారుజాము 3 గంటల నుంచి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అలాగే పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా వేలాది మంది భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు.