ప్రజలపై విద్యుత్‌ భారాలు తగ్గించాలి : సీపీఎం

ABN , First Publish Date - 2023-06-18T23:11:49+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలిచ్చి విద్యుత్‌ చార్జీలను ఎడాపెడా పెం చుతూ ప్రజలపై పెనుభారం మోపుతోందని సీపీఎం రాష్ట్ర కా ర్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు విమర్శించారు.

ప్రజలపై విద్యుత్‌ భారాలు తగ్గించాలి : సీపీఎం

పాయకాపురం, జూన్‌ 18 : వైసీపీ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలిచ్చి విద్యుత్‌ చార్జీలను ఎడాపెడా పెం చుతూ ప్రజలపై పెనుభారం మోపుతోందని సీపీఎం రాష్ట్ర కా ర్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన విద్యుత్‌ పోరుబాటలో భాగంగా ఆదివారం 61, 62, 63వ డివిజన్లలో పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం స్థానికులకు వ చ్చిన విద్యుత్‌ బిల్లులను బాబూరావు పరిశీలించి మాట్లాడు తూ తాను అధికారంలోకి వస్తే 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ ఇస్తానని, చార్జీలను పెంచబోమని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక 7 సార్లు కరెంట్‌ చార్జీలు పెంచడం దారుణమన్నారు. రాష్ట్రంలో 1.89 లక్షల మందికి ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీట ర్లు బిగించి రూ.13500 కోట్లు వృథాఖర్చుతో ప్రజలపై బాదుడుకు సిద్ధమైందని ఆరోపించారు. తక్షణం ట్రూ అప్‌, సర్‌ చార్జీలు, సర్దుబాటు రద్దుచేయాలని లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. నేతలు కె.దుర్గారావు, రమణారావు, కె. శ్రీదేవి, సీహెచ్‌. శ్రీనివాస్‌, సాంబిరెడ్డి పాల్గొన్నారు.

సామాన్యులపై మోయలేని విద్యుత్‌ భారాలు

సీపీఎం జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ

చిట్టినగర్‌ : విద్యుత్‌ చార్జీల భారాలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ అన్నారు. 50,54,55 డివిజన్‌లలో విద్యుత్‌ చార్జీల భారాలను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఆదివారం సాయంత్రం 50వ డివిజన్‌లో ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీవీ కృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న విద్యుత్‌ చార్జీల భారాలతో సామాన్యుల నడ్డివిరుస్తున్నారన్నారు. 30న రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాల్లో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం పశ్చిమ నగర కార్యదర్శి బి.సత్యబాబు, నేతలు జి.ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, స్వప్న, మంగ, ఉష, సూరిబాబు, వెంకట్రావు, జి.సుబ్బారెడ్డి, వి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-18T23:11:49+05:30 IST