Eluru: కన్నాయిగుట్ట అగ్నిప్రమాద ఘటన బాధితులను ఆదుకున్న మాజీ ఎంపీ మాగంటి బాబు

ABN , First Publish Date - 2023-03-20T17:57:07+05:30 IST

వేలేరుపాడు(Velerupadu) మండలం, కన్నాయిగుట్ట (Kannaigutta) అగ్నిప్రమాద (Fire Accident)ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించారు మాజీ ఎంపీ మాగంటి బాబు(Ex. MP Maganti Babu).

Eluru: కన్నాయిగుట్ట అగ్నిప్రమాద ఘటన బాధితులను ఆదుకున్న మాజీ ఎంపీ మాగంటి బాబు

ఏలూరు: వేలేరుపాడు(Velerupadu) మండలం, కన్నాయిగుట్ట (Kannaigutta) అగ్నిప్రమాద (Fire Accident)ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించారు మాజీ ఎంపీ మాగంటి బాబు(Ex. MP Maganti Babu). ఏలూరు నియోజకవర్గం (Eluru Lok Sabha constituency) కన్వీనర్ బొరగం శ్రీనివాసులు కలిసి ఆయన బాధితులకు వంట సామాగ్రి, బట్టలు,కూరగాయలు, చెప్పులు అందజేశారు. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం వలన నివాస గృహాలు పూర్తిగా దగ్ధమై 32 కుటుంబాలు తీవ్రంగా నష్ట పోయి నిరాశ్రయులయ్యారు. దురదృష్టవశాత్తు అగ్నిప్రమాదం జరిగి ఇన్ని కుటుంబాలు నిరాశ్రయులవటం బాధగా ఉందని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని మాగంటి బాబు తెలిపారు. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఇది ఏమాత్రం సరైన పద్దతి కాదన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితులకు సాయమందించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మొగపర్తి సొంబాబు, పారేపల్లి రామారావు, కోనేరు సుబ్బారావు, ముత్తవరపు జగ్గారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అమరవరపు అశోక్, ప్రధాన కార్యదర్శి కట్టం రాంబాబు, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గొంది నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ తెలుగురైతు కార్యదర్శి చీమల వెంకటేశ్వర్లు, ఏలూరు పార్లమెంట్ తెలుగురైతు ఉపాధ్యక్షులు ఉండవల్లి సోమ సుందరం, పరిమి రాంబాబు, పోలవరం మండల పార్టీ అధ్యక్షులు బొడ్డు కృష్ణ, ములిశెట్టి. నాగు, పిన్నమనేని మధుసూదన్, నియోజకవర్గం తెలుగుమహిళా అధ్యక్షురాలు కుంజం సుభాషిణి, పసుమర్తి భీమేశ్వరరావు, మొడియం సూర్యచంద్రరావు, పూనెం రామారావు, మధుర వెంకటరమణ, పార్టీ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-20T17:57:07+05:30 IST