Home » Andhra Pradesh Politics
ఇకపై రాజకీయాలు మాట్లాడనని, ఏ పార్టీని పొగడనని, విమర్శించనని, ఏ పార్టీకి మద్దతివ్వనని సినీనటుడు పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు.
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. గేమ్ చేంజర్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో కరువును నివారించవచ్చని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం నిర్మాణంపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన లఘు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2027 జూలై నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు.
వైసీపీ హయాంలో సేవ ముసుగులో నిలువు దోపిడీ చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇచ్చిన నోటీసు 74కు మంత్రి సమాధానమిచ్చారు.
స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేయడం వెనుక పెద్దకుట్ర జరిగిందని సీనియర్ ఐఏఎస్, నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవహారాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికను బహిర్గతం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలను ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం బుధవారం శాసనసభ ముందు ఉంచింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్రతీ రూపాయిలో 52 పైసలు పన్ను వసూళ్ల ద్వారా వచ్చాయని పేర్కొంది.
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె. పార్థసారథి తెలిపారు. గతంలో హామీ ఇచ్చిన వాటితోపాటు లేని వాటినీ సైతం తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అయితే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే రెండు ప్రధాన హామీలను అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
జనసేన పార్టీలో గురువారం అంటే.. 26వ తేదీన చేరనున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తనపై మొదటి నుంచి మంచి అభిప్రాయం ఉందన్నారు. గతంలో రెండు మూడు మీటింగ్స్‌లో వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి మంచి వ్యక్తులు ఉన్నారంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారని ఈ సందర్బంగా బాలినేని గుర్తు చేశారు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన పాలక వర్గం ఎన్నిక ఏకగ్రీవం కావడం శుభ పరిణామమని ఆ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో క్రికెట్ వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ ఇంకా విషం కక్కుతుండడంపై ఆ ప్రాంతానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఎక్కడా నీరు నిలవ లేదని వారు స్పష్టం చేశారు.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పనికి మాలిన మాటలు మాట్లాడే రోజక్కకు ఇంకా సిగ్గు రాలేదన్నారు. తిరుమలను దోపిడి చేసిన రోజాకు ప్రోటోకాల్ దర్శనం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.