మహిళలకు ఆర్థిక చేయూత
ABN , First Publish Date - 2023-02-23T00:48:50+05:30 IST
గ్రామీణ మహిళలకు చేతివృత్తుల్లో ఉచితశిక్షణతో పాటు ఉపాధి కల్పించటం ద్వారా వారి స్వయం సమృద్ధి, ఆర్ధిక స్వావలంబనకు చేయూత ఇస్తున్నట్టు ఆత్కూరు స్వర్ణభారత్‌ట్ర్‌స్ట ప్రాంగణంలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి ఉచిత శిక్షణాకేంద్రం (యుబీఆర్‌ఎ్‌సఈటీఐ) డైరెక్టర్ వివేకానందశర్మ పేర్కొన్నారు.
ఉంగుటూరు, ఫిబ్రవరి 22 : గ్రామీణ మహిళలకు చేతివృత్తుల్లో ఉచితశిక్షణతో పాటు ఉపాధి కల్పించటం ద్వారా వారి స్వయం సమృద్ధి, ఆర్ధిక స్వావలంబనకు చేయూత ఇస్తున్నట్టు ఆత్కూరు స్వర్ణభారత్‌ట్ర్‌స్ట ప్రాంగణంలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి ఉచిత శిక్షణాకేంద్రం (యుబీఆర్‌ఎ్‌సఈటీఐ) డైరెక్టర్ వివేకానందశర్మ పేర్కొన్నారు. ముక్కపాడు గ్రామ సచివాలయంలో మహిళా టైలరింగ్‌లో ఉచిత శిక్షణాకేంద్రం ఏర్పాటుచేసేందుకు బుధవారం స్థానిక అధికారులు, సచివాలయ సిబ్బందితో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ, ఉచితంగా టైలరింగ్ నేర్పాలని కోరుతూ గ్రామానికి చెందిన సుమారు 35 మంది మహిళలు తమ కేంద్రానికి దరఖాస్తుచేసుకున్న నేపధ్యంలో సాధ్యాసాధ్యాలను స్ధానిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టు తెలిపారు. సచివాలయప్రాంగణంలో మార్చిలో మహిళా టైలరింగ్ ఉచిత శిక్షణకోర్సును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్భంగా కోర్సు వివరాలను ఆయన వెల్లడించారు. టైలరింగ్ శిక్షణ నెలరోజులుంటుందని, ఎనిమిదో తరగతి చదివి, 18-45 మధ్య వయసుగల మహిళలు శిక్షణకు అర్హులని తెలిపారు. శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు కోర్సుమెటీరియల్‌తోపాటు ఉచితంగా కుట్టుమిషన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆసక్తి, అర్హత గల మహిళా అభ్యర్థినులు దరఖాస్తులను గ్రామవలంటీర్లకు అందజేయాలని కోరారు. స్థానిక మహిళలతోపాటు సచివాలయపరిధిలోని గ్రామాల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జీఎ్‌సవీ శేషగిరిరావు, యూబీఆర్‌ఎ్‌సఈటీఐ కో-ఆర్డినేటర్ కిరణ్మయి, ఈవోపీఆర్డీ ఎం.అమీర్‌బాషా, గ్రామపెద్దలు బి.సీతారామరాజు, మన్నే సునీత, సచివాలయసిబ్బంది. వలంటీర్లు పాల్గొన్నారు.