ప్రజల వద్దకు ప్రభుత్వ సేవలు
ABN , First Publish Date - 2023-06-28T01:08:54+05:30 IST
జిల్లా, నగరపాలకసంస్థ పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు. జగనన్న సురక్ష ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టర్ దిల్లీరావు స్థానిక కార్పొరేటర్ కె.అనితతో కలిసి 24వ డివిజన్ 88వ సచివాలయం పరిధిలోని గిరిపురంలో పరిశీలించారు.
కలెక్టరేట్, జూన్ 27 : జిల్లా, నగరపాలకసంస్థ పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు. జగనన్న సురక్ష ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టర్ దిల్లీరావు స్థానిక కార్పొరేటర్ కె.అనితతో కలిసి 24వ డివిజన్ 88వ సచివాలయం పరిధిలోని గిరిపురంలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందించలానే ఉద్ధేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 24వ తేది నుంచి జిల్లాలో 16 మండలాలు, 4 మున్సిపాలిటీలు, విజయవాడ నగరపాలకసంస్థ పరిధిలో 605 గ్రామ, వార్డు సచివాలయాలలో 10256 మంది వలంటీర్లు 720317 కుటుంబాలకు సంబంధించిన గృహాలకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారన్నారు. రోజుకు రెండు సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నేటివరకు 128 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో 2,208 వలంటీర్లు 69,106 కుటుంబాలను సర్వేచేసి వివరాలను నమోదు చేశారన్నారు. వలంటీర్లు గృహాలను సందర్శించినపుడు ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లకు సంబంధించి డాక్యుమెంట్లను సేకరించి సచివాలయాల నుంచి టోకెన్‌లను అందజేయాలని ఆదేశించారు. ఈ సేవలన్నీ ప్రజలకు ఉచితంగానే అందించాలని వలంటీర్లకు సచివాలయ సిబ్బందికి స్పష్టంగా తెలిపామని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ సత్యవతి, యూసీడీ శకుంతల దేవి, వీఆర్‌వో వెంకటేశ్వరరావు, వార్డు సచివాలయ అడ్మిన్ సతీష్ కుమార్, ఎడ్యుకేషన్ సెక్రటరీ మానస, హెల్త్ సెక్రటరీ ఇంద్రజ, శానిటేషన్ సెక్రటరీ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.