దుర్గమ్మ సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు
ABN , First Publish Date - 2023-09-02T01:48:31+05:30 IST
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కనకదుర్గమ్మను శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు దంపతులు దర్శించుకున్నారు.
వన్‌టౌన్, సెప్టెంబరు 1: దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కనకదుర్గమ్మను శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు దంపతులు దర్శించుకున్నారు. వారికి ఈవో భ్రమ రాంబ, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు ఆలయ మర్యాదలు చేశారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదం, శేషవస్త్రం, ఆశీస్సులు అందజేశారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు దంపతులు వారి కుటుంబ సభ్యులు కూడా దుర్గమ్మను దర్శిం చుకున్నారు.