బాల్య వివాహాలు, గృహ హింస అరికట్టాలి

ABN , First Publish Date - 2023-01-29T01:11:13+05:30 IST

బాల్య వివాహాలు, గృహహింసను అరికట్టేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి రామకృష్ణ అన్నారు.

బాల్య వివాహాలు, గృహ హింస అరికట్టాలి

మచిలీపట్నం టౌన్‌, జనవరి 28 : బాల్య వివాహాలు, గృహహింసను అరికట్టేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి రామకృష్ణ అన్నారు. చిత్రకళా సంసద్‌లో క్రాసా ఆధ్వర్యంలో శనివారం చట్టాలపై గ్రామీణ ప్రాంత మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి రామకృష్ణ ముఖ్యఅతిధిగా పా ల్గొని ప్రసంగించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులను అరికట్టాలన్నారు. ధనిక, పేద, కుల, మత బేధాలు లేకుండా రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. విలువలతో కూడిన సమాజాన్ని అందించేందుకు మహిళలు ముందుకు రావాలన్నారు. క్రాసా డైరెక్టర్‌ ఏసుపాదం, మై చాయిస్‌ సంస్థ డైరెక్టర్‌ వి.వి.ఎన్‌. క్రాంతి, రీనా, మంగలేష్‌, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

న్యాయశాఖ ఉద్యోగుల

క్యాలెండర్‌ ఆవిష్కరణ

న్యాయశాఖ ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌ను శనివారం జిల్లా జడ్జి అరుణ సారిక ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు సిహెచ్‌. వరప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌,అసోసియేట్‌ అధ్యక్షుడు టి.రామ్మోహనరావు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌.వి. నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కోశాధికారి ఎం.ఎస్‌. రజనికుమార్‌, ఉపాధ్యక్షుడు సిహెచ్‌. భద్రయ్య, ఎం. వెంకటేశ్వరరావు, ఎం.సునీత, సంయుక్త కార్యదర్శులు టి.తులసీరావు, ఎస్‌కె.కరీముల్లా, డి.రంగనాథ్‌ గుప్తా, సిహెచ్‌. సత్యనారాయణ, జి.అమరనాథ్‌, బి.వి.రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-29T01:11:14+05:30 IST