భక్తిశ్రద్ధలతో కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం
ABN , First Publish Date - 2023-01-24T00:08:44+05:30 IST
వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
నాగాయలంక, జనవరి 23 : వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కొల్లిపర సుబ్బారావు బ్రహ్మత్వంలో జలాభిషేకం, కుంకుమార్చన, సంకర్షన భజన మండలి సామూహిక పారాయణం జరిగాయి. కమిటీ ఛైర్మన్ చిట్టా సాంబశివరావు, చిట్టా వీర అన్నపూర్ణయ్య, తాడికొండ సత్యనారాయణ, చిట్టా శివనాగేశ్వరరావు, చిట్టా శేఖర్, తాడికొండ నాని పాల్గొన్నారు. కూచిపూడి :వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కుంకుమ పూజ, లలితా పారాయణ నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘ నేతలు, మహిళలు, కోలాట భక్త సమాజ సభ్యులు పాల్గొన్నారు. పెడన : వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 18 రకాల ద్రవ్యాలతో మహాభిషేకం నిర్వహించారు. లలిత పారాయణ చేశారు. పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కొల్లూరి చిన్నా పర్యవేక్షణలో కె.టి. మురళీకృష్ణ, వేముల రమేష్, జల్లూరి సత్యనారాయణ, తమ్మన లక్ష్మీతాయారు, కొమ్మూరి విజయదుర్గ, మామిడి సావిత్రి పాల్గొన్నారు. మచిలీ పట్నం టౌన్ : కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ధర్మకర్తల మండలి చైర్మన్ మామిడి మురళీకృష్ణ, కార్యదర్శి, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ ఆధ్వర్యంలో సా మూహిక కుంకుమార్చన నిర్వహించారు.